S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/29/2016 - 14:20

హైదరాబాద్: ఉమ్మడి తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ సిఎం కెసిఆర్ బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో కలిశారు. హైకోర్టు విభజన, లాయర్ల ఆందోళన, జడ్జీలపై సస్పెన్షన్లు, నీటి పారుదల ప్రాజెక్టులపై వివాదాలు తదితర అంశాలపై కెసిఆర్ గవర్నర్‌తో మాట్లాడినట్టు సమాచారం.

06/29/2016 - 12:30

హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారుల జెఎసి పిలుపు మేరకు బుధవారం ‘చలో హైకోర్టు’ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. హైకోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి లాయర్లు, న్యాయమూర్తులు తరలివస్తున్నందున పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

06/29/2016 - 12:29

హైదరాబాద్: తెరాస పార్టీ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం ఇక్కడ సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది. హైకోర్టు విభజన, న్యాయవాదుల పోరాటం, సాగునీటి ప్రాజెక్టులు, కేంద్ర నిధులు వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశం ముగిశాక పలు నిర్ణయాలను సిఎం ప్రకటించే అవకాశం ఉంది.

06/29/2016 - 12:28

దిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను కాంగ్రెస్ ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన రెడ్డి బుధవారం ఇక్కడ కలిశారు. హైకోర్టు విభజన, తెలంగాణలో న్యాయవాదుల ఆందోళన తదితర అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

06/29/2016 - 12:27

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో కెపిహెచ్‌బి కాలనీలో తాజాగా చోరీ జరిగింది. కెపిహెచ్‌బి ఏడో ఫేజ్‌లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటికి తాళాలు వేసుకుని కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లగా చోరీ జరిగింది. ఇంటి తాళం బద్దలుకొట్టిన దొంగలు బీరువాలో ఉన్న మూడు లక్షల రూపాయలను దోచుకున్నారు.

06/29/2016 - 12:26

హైదరాబాద్: జీడిమెట్లలోని ఓ రసాయన గోదాములో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కలవారు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇళ్ల మధ్య కెమికల్ ఫ్యాక్టరీలు, గొడౌన్లు ఉండడంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

06/29/2016 - 07:33

హైదరాబాద్, జూన్ 28: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హైదరాబాద్ కామన్ హైకోర్టును విభజించి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసే ప్రక్రియను సత్వరమే చేపట్టాలని సిఎం కె చంద్రశేఖర్ రావు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.

06/29/2016 - 07:32

గోదావరిఖని, జూన్ 28: భారీ వర్షాలతో కోల్‌బెల్ట్ తడిసి ముద్దయ్యింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్ర వరకూ ఎడతెరపిలేని వానతో కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతం నానుతోంది. వర్షాకాలం సమీపించిన నాటినుంచి మొదటిసారిగా నిరంతరంగా వర్షం కురుస్తూనే ఉంది. సీజన్ మొదలైన దగ్గర్నుంచీ క్షణంతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఎదురైంది.

06/29/2016 - 07:30

ఆదిలాబాద్, జూన్ 28: ఆలస్యంగానైనా నైరుతి కరుణించడంతో తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తుంటే, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలు ఖరీఫ్ రైతుకు ఊపిరి పోస్తుంటే, అనేకచోట్ల జనజీవనాన్ని స్థంభింపచేస్తున్నాయి.

06/29/2016 - 07:28

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణలో మరో రెండు రోజుల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సర్ట్ఫికేట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కానున్నప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య, సీట్లు, ఫీజుల విషయం బహిరంగ పరచకుండా ప్రభుత్వం దాపరికాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణలోని దాదాపు 95 శాతం కాలేజీలు వివిధ రాజకీయ పార్టీల నేతలకు చెందినవే కావడం గమనార్హం. దాంతో ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడి వస్తున్నట్టు తెలిసింది.

Pages