S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/16/2016 - 06:53

హైదరాబాద్, జూన్ 15: మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను బాహటంగా కొనేస్తున్నారు2 అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ సిఎం కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఫిరాయింపులకు కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ పిసిసి సమన్వయ కమిటీ సమావేశానికి దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

06/16/2016 - 06:51

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెరాసను అధికారంలో కొనసాగనీయకుండా రాష్టప్రతి పాలన పెట్టాలని కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బాంబుపేల్చారు. ఈ రహాస్యాన్ని తొలిసారి బయట పెడుతున్నానని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

06/16/2016 - 06:34

భద్రాచలం, జూన్ 15: ఆధ్యాత్మిక, ఇతిహాస ప్రాధాన్యత కలిగిన భద్రాచలం శ్రీ రామ దివ్యక్షేత్రం తాజాగా కేంద్ర రామాయణ వలయంలో చోటు సంపాదించుకుంది. స్వదేశీ దర్శన్ పేరిట దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, ఇతిహాస ప్రాధాన్యమున్న ప్రాంతాలను కలుపుతూ కేంద్ర పర్యాటక శాఖ రామాయణ పర్యాటక వలయంగా ప్రకటించింది.

06/15/2016 - 17:44

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచుతున్న తెరాస పాలకులు భారీగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

06/15/2016 - 17:44

హైదరాబాద్: తెరాస పాలనలో తెలంగాణ నాశనమవుతోందని కొందరు కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని, నిజానికి కాంగ్రెస్ పార్టీయే భ్రష్టుపడుతోందని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

06/15/2016 - 17:43

కరీంనగర్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్న ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఏడునెలల మగశిశువు మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

06/15/2016 - 17:08

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ నాయకులు జి.వినోద్, జి.వివేక్ బుధవారం తెరాసలో చేరారు. సిఎం కెసిఆర్ సమక్షంలో వీరంతా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. నల్గొండ జిల్లా నుంచి గుత్తా అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇక్కడి తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు.

06/15/2016 - 17:05

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం లభించిందని టి.టిడిపి నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ పరిణామాలు ముందుగా ఊహించినవేనని ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన వర్క్‌షాప్‌లో అన్నారు. గతంలో కెసిఆర్ ఎమ్మెల్యేలను కొంటున్నపుడే కాంగ్రెస్ పార్టీని హెచ్చరించామని, ఆ తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను బలవంతంగా బయటకు పంపారని అన్నారు.

06/15/2016 - 14:18

హైదరాబాద్: అధిక ఫీజులు తగ్గించాలని తాము అడిగితే స్కూల్ యాజమాన్యం 27 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇళ్లకు పంపేసిందని తల్లిదండ్రులు ఆందోళన ప్రారంభించారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో మాతా అమృతానందమయి స్కూల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫీజులు తగ్గించాలంటూ కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్య ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ సందర్భంగా వాగ్వివాదం చోటు చేసుకుంది.

06/15/2016 - 14:18

హైదరాబాద్: తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఐటి రంగానికి సంబంధించి మంచి వృద్ధి రేటును సాధించామని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన బుధవారం 2016 వార్షిక ఐటి ప్రణాళికను ఆవిష్కరించారు. బహుళజాతి సంస్థలు త్వరలోనే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడతాయని, సిలికాన్ వ్యాలీలో తెలంగాణ ఐటి హబ్ అవుట్ పోస్టును ప్రారంభిస్తామన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటి సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Pages