S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/15/2016 - 04:55

హైదరాబాద్, జూన్ 14: రాష్టవ్య్రాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రంజాన్ పురస్కరించుకుని ఈనెల 26న నిజాం కాలేజీ మైదానంలో అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

06/15/2016 - 04:54

ఆదాయ వృద్ధిలో దేశంలోనే టాప్ కరవు సమయంలోనూ రికార్డుల మోత
ఏప్రిల్, మే నెలల్లో 27.45 శాతం వృద్ధి వార్షికాదాయం పెరుగుదలకు చాన్స్
బంగారు తెలంగాణకు ఇదే రహదారి సంతృప్తి వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్

06/14/2016 - 18:15

హైదరాబాద్: ఎలాంటి కదలిక లేకుండా రుతుపవనాలు స్థిరంగా ఉండిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షం కురిసే అవకాశం కనిపించడం లేదు. కేరళలో ప్రవేశించిన 48 గంటల్లోగానే రుతుపవనాలు కోస్తా, రాయలసీమ ప్రాంతంలో ప్రవేశించడంతో భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఆ తర్వాత రుతుపవనాలు మందగించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే రుతుపవనాలు విస్తరించడం లేదు.

06/14/2016 - 18:14

హైదరాబాద్: నగరంలోని కోఠి వద్ద ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణులు పడుతున్న అవస్థలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఆస్పత్రిలో తగిన సౌకర్యాలు లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన కోర్టు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి, ఆస్పత్రి సూపరింటెండెంటుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

06/14/2016 - 18:12

హైదరాబాద్: వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతూ ‘బంగారు తెలంగాణ’ కోసమేనని మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. పార్టీ వీడే నేతలు పదవులకు రాజీనామా చేసి తెరాసలో చేరాలన్నారు. రాజీనామాలు చేయించాకే వారిని చేర్చుకునేలా తెరాస నిర్ణయం తీసుకోవాలన్నారు. జానారెడ్డి లాంటి వారు ముందు వరసలో నిలబడి పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు.

06/14/2016 - 17:07

దిల్లీ: తెలంగాణ సిఎం కెసిఆర్‌తో సన్నిహితంగా ఉంటూ పలురకాలుగా లబ్ధిపొందే కొందరు కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరడమే మంచిదని ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. కాంట్రాక్టులు వంటి ప్రయోజనాలను ఆశించేవారు కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోవడం మంచిదన్నారు. కాంగ్రెస్‌లో కోవర్టుల గురించి సమయం వచ్చినపుడు తాను వాస్తవాలు వెల్లడిస్తానన్నారు.

06/14/2016 - 17:06

హైదరాబాద్: నగరంలోని ఫలక్‌నుమా వద్ద ఓ టిఫిన్ సెంటర్‌లో మంగళవారం ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించి 3 తులాల బంగారం, కొంత నగదు పట్టుకుపోయారు. టిఫిన్ సెంటర్ యజమాని లక్ష్మిపై వారు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దాడిచేసన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

06/14/2016 - 17:05

దిల్లీ: టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ నేతల ఫిరాయింపులు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన వివరించారు. బుధవారం ఇక్కడ జరిగే పార్టీ సమన్వయ సంఘం సమావేశంలో పలు అంశాలను చర్చించనున్నట్టు ఉత్తమ్ మీడియాకు తెలిపారు.

06/14/2016 - 17:05

హైదరాబాద్: ప్రలోభాలకు గురిచేసి ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటూ సిఎం కెసిఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. అనైతిక ఫిరాయింపులను జనం సైతం అసహ్యించుకుంటున్నారన్నారు.

06/14/2016 - 17:05

హైదరాబాద్: తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె యోచనకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు స్వస్తి పలికారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డితో మంగళవారం జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లకు ఆమోదం లభించింది.

Pages