S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/28/2016 - 05:10

హైదరాబాద్, జూన్ 27: రంగారెడ్డి జిల్లా కీసరలో జరిగిన న్యాయవాది ఉదయ్‌కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. న్యాయవాది ఉదయ్‌కుమార్ తన కారుతోపాటు సజీవంగా దహనమైన విషయం తెలిసిందే. భూ వివాదంతోనే ఈ హత్య జరిగినట్టు సోమవారం పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో లోకేష్‌బాబు, సుమన్‌రెడ్డి అనే నిందితులను అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లోని 5ఎకరాల భూ వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

06/28/2016 - 05:09

హైదరాబాద్, జూన్ 27: మల్లన్న సాగర్‌కు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ను వెంటనే ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రోఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద ముంపు నివారణకు వీలున్న మార్గలను పరిశీలించాలని సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని కోరారు.

06/28/2016 - 05:08

న్యూఢిల్లీ, జూన్ 27: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణకు చెందిన ముగ్గురు సీనియర్ నాయకులు వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, ఎఐసిసి నాయకుడు వి. హనుమంత రావు సోమవారం సోనియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముగ్గురూ తెలంగాణలో పార్టీ స్థితిగతులపైనే చర్చించారు.

06/28/2016 - 05:07

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నష్టాల్లోంచి గట్టెక్కించేందుకే చార్జీలు పెంచక తప్పలేదని, పెంచిన చార్జీలపై ప్రజల నుంచి గానీ, ప్రయాణికుల నుంచి గానీ ఎలాంటి వ్యతిరేకత రాలేదని టిఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆర్టీసి చార్జీల పెంపుదలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మదు దగ్ధం చేయడాన్ని ఆయన మండిపడ్డారు.

06/27/2016 - 18:15

హైదరాబాద్: వనస్థలిపురంలోని గౌతం మోడల్ స్కూల్ వద్ద సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అయాన్ అనే ఎల్‌కెజి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఎప్పటిలాగే భోజనం తినిపించేందుకు స్కూల్ వద్దకు అయాన్ తల్లిదండ్రులు వచ్చారు. కుమారుడి కోసం అక్కడ గాలించినా ఫలితం దక్కలేదు. స్కూలు సిబ్బంది కూడా అయాన్ జాడ తెలియలేదని చేతులెత్తేశారు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

06/27/2016 - 18:14

హైదరాబాద్: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరతను నివారించేందుకు 9,335 మంది విద్యావాలంటీర్లను నియమించాలని సిఎం కెసిఆర్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యావాలంటీర్ల నియామకం జరుగుతుంది. టీచర్ పోస్టులను భర్తీ చేసేవరకూ వీరి సేవలను ఉపయోగించుకుంటారు.

06/27/2016 - 18:13

హైదరాబాద్: కీసర మండలం కీసరదాయర వద్ద కారులో న్యాయవాది ఉదయ్‌కుమార్ యాదవ్‌ను సజీవ దహనం చేసిన ఉదంతంలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి మిస్టరీని పోలీసులు ఛేదించారు. భూ వివాదాల కారణంగానే న్యాయవాదిని హత్య చేశారన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. తన భర్త కనిపించకుండా పోయినట్టు మృతుని భార్య ఫిర్యాదు చేయడంతో మృతదేహానికి సంబంధించిన భాగాలను డిఎన్‌ఎ పరీక్షలకు పంపారు.

06/27/2016 - 18:11

వరంగల్: పాఠశాల పక్కనే ఉన్న పాడుబడిన బావి నుంచి వెలువడిన విషవాయువులను పీల్చి ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఘన్‌పూర్ మండలం చెల్పూరులోని ప్రభుత్వ పాఠశాల వద్ద పురాతన బావిలో నుంచి కొద్ది రోజులుగా విషవాయువులు వెలువడుతున్నాయి. శనివారం పది మంది, సోమవారం ఆరుగురు పిల్లలు అస్వస్థతకు లోనవడంతో వారిని వరంగల్, భూపాలపల్లి ఆస్పత్రులకు తరలించారు.

06/27/2016 - 18:11

హైదరాబాద్: పల్లెవెలుగు బస్సులతో తమ సంస్థకు ఏటా 800 కోట్ల రూపాయల నష్టం వస్తోందని, అయినప్పటికీ మారుమూల గ్రామాలకు సైతం రవాణా సౌకర్యాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. 56 వేల మంది కార్మికులను కాపాడుకుంటూ ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదాయాన్ని పెంచేందుకు పలు మార్గాలను అనే్వషిస్తున్నామని ఆయన తెలిపారు.

06/27/2016 - 18:10

హైదరాబాద్‌: పరిశ్రమలకు విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్‌ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టింది. ఈ రాయితీలు ఏడాది పాటు నిర్ణయించింది. స్పిన్నింగ్‌ మిల్లుల విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు రూ.2, ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమల యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.1.50 తగ్గించింది.

Pages