S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/27/2016 - 13:33

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల చాకచక్యంగా చోరీలు చేసిన సునీతారెడ్డి అనే మహిళా దొంగను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనాథలకు, వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆమె దొంగతనాలు చేసిందని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఆమె నుంచి బంగారు నగలు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

06/27/2016 - 12:13

హైదరాబాద్: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు మలేషియా, సింగపూర్ల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నారు.

06/27/2016 - 12:12

హైదరాబాద్: సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీలోని రిలయన్స్ ప్రెష్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ మాల్‌లో పొగలు వస్తుండటం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలు అర్పడానికి యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

06/27/2016 - 12:12

ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతురావు, పాల్వాయి గోవర్థన్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం పాల్వాయి మీడియాతో మాట్లాడుతూ, నాయకులు కలసిమెలసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు.

06/27/2016 - 12:01

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల కదిలిక నేపథ్యంలో ఎపి, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 48 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇక్కడి వాతావరణ శాఖ కార్యాలయం సోమవారం తెలిపింది. మరోవైపు కోస్తాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగతోంది. తేమగాలులతో ఉష్ణోగ్రతలు బాగా చల్లబడ్డాయి.

06/27/2016 - 08:20

హైదరాబాద్, జూన్ 26: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల అజెండాగా మారిందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టిడిపి నాయకులది పూటకో మాట, జిల్లాకో తీరుగా ఉందని విమర్శించారు.

06/27/2016 - 08:15

తొగుట, జూన్ 26: భూసేకరణకు భారత ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని కాదని జిఓల ద్వారా భూసేకరణ చేసే ప్రభుత్వాలకు ఏటిగడ్డకిష్టాపూర్ వాసులు కనువిప్పు కలిగించారని, వారు చేస్తున్న ఆందోళన దేశవ్యాప్తంగా ఆదర్శనీయమైందని టిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు.

06/27/2016 - 08:15

గద్వాల, జూన్ 26: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కృష్ణా పుష్కరాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్కర పనులు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయతే, పుష్కరాల పనులపై డేగకన్ను వేసిన పలువురు నేతలు నయానో.. బయానోతో పనులు దక్కించుకొని పనుల్లో నాణ్యతను నగుబాటు చేస్తున్నారు.

06/27/2016 - 04:48

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ముస్లిం సోదరులకు ఆదివారం సాయంత్రం నిజాంకాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాట్లాడుతూ, ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక కమిటీని వేశామన్నారు.

06/27/2016 - 04:44

కీసర, జూన్ 26: కారులోనే కాలి బూడిదైన న్యాయవాది సంఘటన కీసరలో సంచలనం రేకెత్తించింది. రంగారెడ్డి జిల్లా కీసరలో ఆదివారం ఉదయం కొందరు మార్నింగ్ వాక్‌కు వెళుతుండగా మల్లన్న గుడి సమీపంలో కాలి బూడిదైన కారు కనిపించింది. దగ్గరికెళ్లి చూసేసరికి కారులో ఒక వ్యక్తి కాలి బూడిదైనట్టు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సిఐ గురువారెడ్డి సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను పిలిపించారు.

Pages