S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/27/2016 - 04:39

హైదరాబాద్/ గచ్చిబౌలి, జూన్ 26: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ రోడ్డు మధ్య గుంత తవ్వి విడిచి పెట్టడంతో, ప్రమాదవశాత్తూ అందులో పడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

06/26/2016 - 07:49

సిద్దిపేట, జూన్ 25 : మెదక్ జిల్లాలో మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యపై ప్రభుత్వం 15 రోజుల్లో స్పష్టత ఇవ్వకుంటే గజ్వేల్ నియోజకవర్గంలోని సిఎం ఫాంహౌస్‌ను భూ నిర్వాసితులతో కలసి ముట్టడిస్తానని తెలుగుదేశం పార్టీ శాసనసభ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పోలీసులు మొ దటి లాఠీ దెబ్బకైనా, తూటాకైనా తాను, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి ముందుంటామన్నారు.

06/26/2016 - 07:46

గోదావరిఖని, జూన్ 25: ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజ ల ఆస్తి... ఎన్ని కోట్ల నష్టం వచ్చినా ఆర్టీసీని అమ్ముకోం... ప్రైవేట్ పరం చేయం... ఎన్ని ఒడిదొడుకులనైనా ఎదుర్కొని ఆర్టీసీని బతికించుకుంటాం’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్టాండ్‌లో శనివారం 10 సిటీ బస్సులు, ఒక రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎసి బస్సును ఆయన ప్రారంభించారు.

06/26/2016 - 07:43

హైదరాబాద్, జూన్ 25: జంట నరాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ డిసిపి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితులు రెండు నిందితులు రెండు బృందాలుగా ఏర్పడి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు.

06/26/2016 - 07:40

మహబూబ్‌నగర్, జూన్ 25: మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వింజమూరు, గొండ్యాల్, వేపూర్, కోత్లాబాద్ వాగులు పొంగిపొర్లుతుండడంతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చింది. వరద కారణంగా శనివారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 9 అడుగులకు చేరింది.

06/26/2016 - 07:37

షాద్‌నగర్, జూన్ 25: దేశంలో భారతీయ జనతా పార్టీ అమ్ముడుపోయే పార్టీ కాదని..్భవిష్యత్‌లో అందలమెక్కే పార్టీ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని గ్రీన్‌పార్క్ ఫంక్షన్‌హాల్‌లో శనివారం బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

06/26/2016 - 07:32

నల్లగొండ, జూన్ 25: తెలంగాణ రాష్ట్రంలో ఇన్నాళ్లుగా మరుగున పడిన ప్రాచీన చారిత్రాక ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

06/26/2016 - 07:28

హైదరాబాద్, జూన్ 25: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మహిళా సాధికారత కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలేదని, పైగా మహిళా హక్కులను కాలరాస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ కొనెనికా రాయ్ ఆరోపించారు. శనివారం మహిళా సమాఖ్య తెలంగాణ అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది.

06/26/2016 - 07:17

హైదరాబాద్, జూన్ 25: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల కేటాయింపులో కాంట్రాక్టర్ ఎంపికపై తాను లోగడ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసినందున, పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ బిజెపి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి శనివారం హైదరాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

06/26/2016 - 07:16

హైదరాబాద్, జూన్ 25: ఐఐటి శిక్షణలో పేరొందిన విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యుడు చుక్కా రామయ్య స్వల్ప అస్వస్థత వల్ల నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి తీవ్రమైన నడుమునొప్పి రావడంతో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు.

Pages