S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/26/2016 - 07:15

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 65 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు 26, అనలిస్టులు 24, పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ -1, స్టెనో 4, జూనియర్ అసిస్టెంట్- టైపిస్టులు 3, జూనియర్ అసిస్టెంట్‌లు 5, స్టెనో-పర్చేజ్ అసిస్టెంట్‌లు -1, టెక్నీషిన్లు -1 పోస్టులను భర్తీ చేస్తారు.

06/26/2016 - 07:14

హైదరాబాద్, జూన్ 25: పదేళ్ల నుండి తన భర్త కనిపించడం లేదని, తన కుటుంబం పోషణ ఇబ్బందిగా ఉందని, తన భర్త ఆచూకీ తెలియచేయాలని లేదా బతుకుతెరువుకు ఏదైనా మార్గం చూపించాలని ఒక మహిళ కన్నీళ్లపర్యంతం కాగా, తెలంగాణ సర్కారు కనికరించింది. సదరు మహిళకు ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఎం.

06/26/2016 - 07:14

గుంటూరు, జూన్ 25: పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం గుంటూరులో జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్, ఎపి డబ్ల్యుఎస్‌ఐపి ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాలను శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి మంత్రి దేవినేని ప్రారంభించారు.

06/26/2016 - 07:13

హైదరాబాద్, జూన్ 25: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే కరవు మండలాలను ఎంపిక చేశామని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం శనివారం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బిఆర్ మీనా కరవు మండలాలను ప్రకటించిందుకు నిర్దేశించిన మార్గదర్శకాలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

06/26/2016 - 07:12

హైదరాబాద్, జూన్ 25: మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునే పార్టీలను ప్రజలు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటారని టిఆర్‌ఎస్ ఎంపి బూర నర్సయ్య గౌడ్ హెచ్చరించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో శనివారం నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు.

06/26/2016 - 07:11

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలోని 11 జూపార్క్‌లలో సందర్శకులతో పాటు జంతువులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యాటక మంత్రి జోగు రామన్న ఆదేశించారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రి అధ్యక్షతన జరిగిన జూ పార్కుల అథారిటీ పాలకవర్గ సమావేశంలో 2016-17 వార్షిక ప్రణాళికను ఆమోదించారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌పై ప్రత్యేక శ్రద్ద చూపించాలని మంత్రి ఆదేశించారు.

06/26/2016 - 07:11

హైదరాబాద్, జూన్ 25: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి అనుకూలంగా బ్రిటన్ ఓటు వేయడం (బ్రెగ్జిట్) ఐరోపా దేశాలతోపాటు అమెరికాలో జాతీయ వాదులు ఆదరణ పొందడం వంటి పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న అస్థిర పరిస్థితులు..్భరత్‌లో అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు దోహద పడతాయని, అయితే వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే మనదేశం ముందు తన ఇల్లు చక్కదిద్దుకోవాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నార

06/26/2016 - 07:10

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోందని ఎబివిపి నేతలు శనివారం నాడు తీవ్రంగా విమర్శించారు. ప్రాధమిక విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతక విద్యారంగాల్లో సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుందని ఆరోపించారు.

06/25/2016 - 18:13

హైదరాబాద్: గతంలో కంటే ఎంతో ఘనంగా ఈ ఏడాది జంట నగరాల్లో బోనాలు పండగను నిర్వహించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆయన నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం శనివారం నాడు బోనాల ఏర్పాట్లపై సమీక్షించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నాయిని అధికారులను ఆదేశించారు.

06/25/2016 - 18:13

గోదావరి ఖని: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రజలంతా ఆ సంస్థ మనుగడను కాపాడుకోవాలని మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్ రెడ్డి అన్నారు. గోదావరి ఖనిలో శనివారం నాడు పది సిటీ బస్సులను, తిరుపతికి ఏసీ బస్సును వారు ప్రారంభించారు. నష్టాలతో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోందన్నారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Pages