S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/14/2016 - 06:45

గంభీరావుపేట, జూన్ 13: కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కల్తీనూనె తయారీ కేంద్రాన్ని అధికారులు సోమవారం సీజ్ చేశారు. సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్ ఆదేశాల మేరకు తహసీల్దార్ దార ప్రసాద్, ఎంపిడివో వంగ సురేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి తరలివెళ్లి నూనె కేంద్రాన్ని సీజ్ చేశారు.

06/14/2016 - 06:45

సంగారెడ్డి, జూన్ 13: అవినీతి రహిత పాలన అందిస్తామని, స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్ల ధనాన్ని తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తామని హామీలిచ్చిన మోదీ అధికారంలోకి రాగానే అందుకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఘాటుగా విర్శించారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ముంచిన విజయ్ మాల్యా లాంటి అవినీతి పరులకు కేంద్ర ప్రభుత్వం అండదండలు అందిస్తుందని ఆరోపించారు.

06/14/2016 - 06:44

హైదరాబాద్, జూన్ 13: ఈనెల 17వ తేదీ నుంచి 23వరకు సీజనల్ వ్యాధుల నివారణ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు వస్తాయని అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు.

06/14/2016 - 06:44

హైదరాబాద్, జూన్ 13: కృష్ణా పుష్కరాల కోసం రూ. 771 కోట్ల వ్యయంతో చేపట్టిన 728 పనులను ముమ్మరం చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

06/13/2016 - 18:12

హైదరాబాద్: రోగిని చూసేందుకు వచ్చిన బంధువులపై నిమ్స్ ఆస్పత్రిలోని సెక్యూరిటీ గార్డులు దౌర్జన్యం చేశారు. ఈ ఘటనపై తమకు అందిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన బావను చూసేందుకు వచ్చాడు.

06/13/2016 - 18:11

హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన పనులను సకాలంలో నాణ్యతతో పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. ఆయన సచివాలయంలో సోమవారం నాడు దేవాదాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పుష్కర ఘాట్లు, టాయిలెట్లు, మంచినీటి వసతి తదితర సౌకర్యాలను అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అవస్థలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

06/13/2016 - 17:24

హైదరాబాద్: కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఈనెల 15న తాము అధికారికంగా తెరాస పార్టీలో చేరుతున్నామని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని ఆశించి తామంతా తెరాసలో చేరుతున్నామన్నారు. సమయం, సందర్భం వచ్చినపుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుత్తా తెలిపారు.

06/13/2016 - 17:23

హైదరాబాద్: రెండువారాల విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన తెలంగాణ మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ సోమవారం నగరంలోని పలు కాలనీలు, బస్తీల్లో పర్యటించారు. నగర పాలనలో వందరోజుల ప్రణాళిక తీరుతెన్నులను ఆయన సమీక్షించారు. షాపూర్‌నగర్‌లో జిహెచ్‌ఎంసి 5 రూపాయలకు అందజేస్తున్న భోజనాన్ని ఆయన తిన్నారు. ఈ భోజనం బాగుందని అధికారులను మెచ్చుకున్నారు.

06/13/2016 - 17:23

హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు యోచిస్తున్నారు. ఈ మేరకు న్యాయశాఖ ఉద్యోగ సంఘ నేతలు ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, న్యాయాధికారుల విభజన వంటి డిమాండ్లపై వారు పోరుబాట పడుతున్నారు.

06/13/2016 - 17:22

కరీంనగర్: కోటి రూపాయల మేరకు ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకున్న కమాన్‌పూర్ మండలం బొల్లారం మాజీ సర్పంచ్ జంగిడి రాజయ్యను పోలీసులు సోమవారం ఇక్కడ అరెస్టు చేశారు. పంచాయితీ అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను స్వాహా చేసిన ఆయన కొన్నాళ్లుగా తప్పించుకుతిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఆయనను పోలీసులు అరెస్టు చేయడంతో నిధుల స్వాహాపై వివరాలు బయటపడే అవకాశం ఉంది.

Pages