S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/25/2016 - 13:43

ఖమ్మం: వివాహేతర సంబంధం వద్దన్నందుకు భర్తను భార్య గొడ్డలితో నరికి చంపిన ఉదంతం శనివారం పాల్వంచలో వెలుగు చూసింది. పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో కూలిపనులు చేసుకునే గోపాలకృష్ణ భార్య రాములమ్మ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై దంపతుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతోంది. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలన్న ఆలోచనతో రాములమ్మ ఈ కిరాతకానికి తెగించింది.

06/25/2016 - 11:45

మహబూబ్‌నగర్: ప్రజలపై ఆర్థిక భారం మోపేలా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ వనపర్తిలో ఆ పార్టీ కార్యకర్తలు శనివారం భారీఎత్తున ధర్నా జరిపారు. పెంచిన రేట్లను తగ్గించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రకటించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

06/25/2016 - 11:44

మెదక్: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూ నిర్వాసితుల డిమాండ్లకు మద్దతుగా టి.టిడిపి నేత రేవంత్‌రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్‌లో శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. రెండురోజుల పాటు ఆయన దీక్ష చేస్తారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 21 వేల ఎకరాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

06/25/2016 - 08:18

హైదరాబాద్, జూన్ 24: దేశంలో మొదటిసారి డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు నిర్వహించిన ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. తొలుత ఇది ఎంతో క్లిష్టమైనదని భావించిన ప్రభుత్వం తర్వాత సమస్యలను అధిగమిస్తూ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియను ఈ ఏడాదే సాకారం చేసింది. గత నెల రోజులుగా వివిధ దశలను అధిగమించిన ఆన్‌లైన్ అడ్మిషన్లకు అలాట్‌మెంట్ లేఖలు ఇచ్చారు.

06/25/2016 - 08:17

హైదరాబాద్, జూన్ 24: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపి భవన్ తమదేనన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ తో దానిని కూడా ఏపి ప్రభుత్వం, తెలంగాణ సర్కారుకు దఖలు పరుస్తుందా? అన్న చర్చకు తెరలేచింది. ఏపి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే తమకు ఢిల్లీలో నిజాంభవన్ ఉండేదన్న వాదన తెలంగాణ రాష్ట్రం వినిపిస్తోంది.

06/25/2016 - 07:55

హైదరాబాద్, జూన్ 24: వర్షాకాలానికి ముందే ఆయకట్టుపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు సరైన యాక్షన్ ప్లాన్ లేకపోవడం వల్లనే ఆయకట్టుకు నీరు అందకపోవడం వల్ల పాతికేళ్లుగా వివిధ ప్రాజెక్టుల కింద కాలువలు అత్యంత దారుణంగా తయారయ్యాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

06/25/2016 - 07:54

హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రంలో సినిమా పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టిఐపిసియు)ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. శుక్రవారం ఇక్కడ సినిమా పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టిఐపిసియును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పైరసీకి పాల్పడుతున్నట్లు రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

06/25/2016 - 07:52

వికారాబాద్, జూన్ 24: ఆరు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కోడమేమిటని, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని పుల్‌మద్ది అటవీ ప్రాంతంలో వివాదాస్పద భూములను ఆమె రైతులచే దున్నించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని రైతులను అడ్డుకున్నారు.

06/25/2016 - 07:36

నల్లగొండ, జూన్ 24: ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం ఏ మంచి పనులు చేసినా అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని, ప్రాజెక్టులు పూర్తయితే రాజకీయంగా వారికి పుట్టగతులుండవనే అడ్డుపుల్లలు వేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.

06/25/2016 - 07:35

సంగారెడ్డి, జూన్ 24: సాధారణ ఎమ్మెల్యే స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు పదవులను అధిరోహించడానికి కెసిఆర్‌కు మెదక్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని, అధికార దురహంకారంతో అండగా నిలిచిన ప్రజల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సి.దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు.

Pages