S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/24/2018 - 04:16

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 23: బీజేపీ సభ్యత్వానికి, జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కుదిరింది.

04/24/2018 - 04:16

బోధన్, ఏప్రిల్ 23: తెలంగాణ శశ్యశ్యామలం సంగతెలా ఉన్నప్పటికీ మరాఠా ఇసుక క్వారీలు తెలంగాణ మంజీరా పరీవాహక గ్రామాలను ఎడారిగా మారుస్తున్నాయి. హద్దులు దాటి జరుపుతున్న ఇసుక తవ్వకాలు మంజీరమ్మ తలాపున ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు, బోరుబావులు వట్టిపోయేలా చేస్తున్నాయి. పంట పొలాలలో ఉన్నటువంటి బోర్లలో నీటి సామర్థ్యం తగ్గిపోవడంతో మంజీరా రైతులు ఆందోళన చెందుతున్నారు.

04/24/2018 - 04:15

గంగాధర, ఏప్రిల్ 23: నీళ్లు, నిధులు, నియామకాల కోసం అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు, పేద ప్రజలు, అన్ని వర్గాల ప్రజల అభివృది,్ధ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

04/24/2018 - 03:27

జనగామ టౌన్, ఏప్రిల్ 23: తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుందని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. 10జిల్లాలకు చెందిన మత్స్యకార్మిక సంఘాల నుండి ఎంపికైన సభ్యులను, పలువురు మత్స్యశాఖ అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

04/24/2018 - 02:45

హైదరాబాద్, ఏప్రిల్ 23: భారత కమ్యూనిస్టు పార్టీ 23వ జాతీయ మహాసభలను ఈనెల 26 నుంచి 29వరకు కేరళలోని కొల్లాం జిల్లా కేంద్రంలో కొనసాగనున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయం మగ్దూం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

04/24/2018 - 02:44

హైదరాబాద్, ఏప్రిల్ 23: పాతబస్తీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను వెంటనే రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా ఎస్‌కె జోషి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో పాతబస్తీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై సిఎస్ సమీక్ష నిర్వహించారు.

04/24/2018 - 02:44

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని పొన్నాల సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఇంత వరకు నష్టం వాటిల్లిన పంటలపై ప్రభుత్వం సమాచారం లేదన్నారు.

04/24/2018 - 02:43

హైదరాబాద్, ఏప్రిల్ 23: దేవాలయాల పరిపాలనకు సంబంధించి ‘్ధర్మిక పరిషత్’ ఏర్పాటులో తీవ్రమైన జాప్యం జరుగుతోందన్న భావన హిందూ సమాజంలో కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు కావస్తోంది. ఈ నాలుగేళ్లలో చట్టప్రకారం ఏర్పాటు కావలసిన సంస్థల్లో ధార్మిక పరిషత్ మినహా దాదాపుగా అన్ని సంస్థలూ ఏర్పాటయ్యాయి.

04/24/2018 - 02:43

హైదరాబాద్, ఏప్రిల్ 23: కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారారని బిజెపి నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ పట్ల సిపిఎం నేతల వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, ఎమ్మెల్యే సి. రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ డిమాండ్ చేశారు.

04/24/2018 - 02:42

హైదరాబాద్, ఏప్రిల్ 23: టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టిజెఎస్)లో తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేసే విషయంలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Pages