S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/25/2016 - 07:12

ఖమ్మం, జూన్ 24: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని నాయకన్‌గూడెం వద్ద ఎనె్నస్పీ ఇన్‌ఫ్లో కాల్వలో శుక్రవారం తెల్లవారుఝామున ఆర్టీసి బస్సు ప్రమాదవశాత్తు పడింది. హైదరాబాద్ నుంచి మణుగూరు వెళ్తున్న మణుగూరు డిపో డీలక్స్ బస్సు నాయకన్‌గూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి పాలేరు రిజర్వాయర్‌లోకి ఎనె్నస్పీ నీరు వచ్చే ఇన్‌ఫ్లో కాల్వలోకి పడిపోయింది.

06/25/2016 - 07:11

హైదరాబాద్, జూన్ 24: తమ పార్టీ నుంచి ఎన్నికై టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్ కుమార్, చిట్టెం రాంమోహన్ రెడ్డిల శాసనసభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కోరారు.

06/25/2016 - 07:03

హైదరాబాద్, జూన్ 24: కల్యాణ లక్ష్మి పథకం అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ పథకం అమలు పలు ప్రాంతాల్లో దుర్వినియోగం కావడం ప్రభుత్వం దృష్టికి రావడంతో మార్పులు చేశారు. నగదు రూపంలో కాకుండా పెళ్లి కూతురు తల్లిపేరు మీద చెక్కు ఇస్తారు. స్థానిక ఎమ్మెల్యే ధ్రువీకరణ తప్పని సరి అనే నిబంధన చేర్చారు. లబ్ధిదారులను ఎంపిక చేసేది ఎమ్మెల్యేనే కాబట్టి ఎమ్మెల్యే ద్వారానే చెక్కు అందజేస్తారు.

06/25/2016 - 06:55

నాగార్జునసాగర్, జూన్ 24: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే సిఎంనని సిఎల్‌పి నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. సాగర్ నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులు, జానారెడ్డి అనుచరులు టిఆర్‌ఎస్‌లో చేరిన తరువాత మొదటిసారిగా నాగార్జునసాగర్‌కు వచ్చిన ఆయనను కలవడానికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. వారందరిని ఉద్దేశించి తన నివాసంలో జానారెడ్డి మాట్లాడారు.

06/25/2016 - 06:32

ఆదిలాబాద్,జూన్ 24: పెద్దలు కుదిర్చిన పెళ్లికి అభ్యంతరం చెప్పడంతోపాటు, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానన్న కూతుర్ని కన్నతండ్రే కడతేర్చిన సంఘటన నేరేడిగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుమార్తె నిర్ణయంపై ఆగ్రహించిన తండ్రి, ఇంట్లో చున్నీతో కూతురి మెడకు ఉరివేసి కడతేర్చన ఘటన సంచలనం రేకెత్తించింది.

06/25/2016 - 06:31

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, అర్చకుల వేతనాలు పెంచడంతో పాటు ఈ శాఖను మరింత బలోపేతం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. మంత్రి వర్గ ఉప సంఘం శుక్రవారం సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది.

06/25/2016 - 06:30

హైదరాబాద్, జూన్ 24: పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసి రాజధానిలో పట్టపగలు గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఘరానా నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని 25 పోలీసు స్టేషన్ల పరిధిలో దాదాపు 80 గొలుసు, నగల దొంగతనాలకు పాల్పడిన మీర్ ముస్త్ఫా అలీ, షేక్ ఖయూమ్ ఎల్‌బినగర్ పోలీసులకు చిక్కారు.

06/25/2016 - 06:26

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం తరఫున అమెరికాలో కంట్రీ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు తెలిపారు. భారతదేశంలో అమెరికా రాయబారి రిచర్డ్ రాహుల్ వర్మతో హైదరాబాద్‌లో కెటిఆర్ శుక్రవారం ఉదయం సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ వ్యాపార వాణిజ్య సంబంధాల్లో అమెరికా తెలంగాణకు సహజ భాగస్వామి అని మంత్రి అన్నారు.

06/25/2016 - 06:23

హైదరాబాద్, జూన్ 24: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని పరిశ్రమలు, మైనింగ్ శాఖా మంత్రి కె తారక రామారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇసుకను అక్రమంగా అంతర్ జిల్లాలకు రవాణా చేసే లారీల విషయంలో కఠినంగా ఉండాలని, క్రిమినల్ కేసులు పెట్టి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. మైనింగ్ శాఖపై జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు.

06/24/2016 - 18:29

హైదరాబాద్‌: 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులపై ఆగస్టు 1 నుంచి నిషేధం విధించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్‌ సంచులపై నిషేధం అమల్లోకి వచ్చాక వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే వాణిజ్య లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులు అమ్మే దుకాణాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Pages