S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/24/2016 - 11:28

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అంబర్‌పేటలో బయటపడిన పోలియో వైరస్‌ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌నడ్డా తెలిపారు. అంబర్‌పేటలో పోలియో వైరస్‌ గుర్తించడంలో నిఘా వ్యవస్థ బాగా పనిచేసిందని మంత్రి ప్రశంసించారు. పోలియో నివారణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి కేంద్రం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

06/24/2016 - 05:55

హైదరాబాద్, జూన్ 23: విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే వెనుకబడిన తరగతుల విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇదే తరహాలో బిసి విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించడానికి మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

06/24/2016 - 05:54

హైదరాబాద్,జూన్ 23: టిఆర్‌ఎస్ ప్రభుత్వం తక్షణమే ఆర్టీసి, విద్యుత్ రంగంలో పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం, వైకాపా పార్టీలు డిమాండ్ చేశాయి. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీసి, విద్యుత్ రంగం పరిస్ధితిని మెరుగుపరచకుండా చార్జీలను పెంచడం దారుణమన్నారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు.

06/24/2016 - 05:53

హైదరాబాద్, జూన్ 23: హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న మిగులు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇతర శాఖల్లో సర్దు బాటు చేయనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల వల్ల ఆయా శాఖల్లో పని భారం పెరిగిందని, కార్పొరేషన్‌కు చెందిన కొందరు ఉద్యోగులను ఆ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్టు చెప్పారు.

06/24/2016 - 05:53

హైదరాబాద్, జూన్ 23: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 16 ఏళ్ల వయసులో ఎంఎ (పొలిటికల్ సైన్స్) పరీక్ష రాశారు. ఎంఎ చివరి పరీక్షను జాంబాగ్‌లోని వివేక వర్ధిని డిగ్రీ కాలేజీలో రాశారు. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్షలో 16 ఏళ్ల వయసులో ఎంఎ పరీక్ష రాసిన తొలి విద్యార్థినిగా దేశంలో రికార్డు సృష్టించారు.

06/24/2016 - 05:49

హైదరాబాద్, జూన్ 23: పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్‌లో దేశంలోని మూడు రాష్ట్రాల్లో తెలంగాణ మొట్టమొదటిదని ఇందుకు గానూ సర్ట్ఫికెట్ ఆఫ్ రికగ్నైషన్ ఉత్తమ అవార్డును కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ అవార్డును ఈనెల 24న ఢిల్లీలోని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ చేతుల మీదుగా తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అందుకోనున్నారు.

06/24/2016 - 05:49

హైదరాబాద్, జూన్ 23: లండన్‌లో తయారైన ప్రాచీన మెరైన్ టెలిస్కోప్, చెస్‌బోర్డును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టోలిచౌక్ మమతా కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ సాలె నుంచి ప్రాచీన విక్టోరియన్ టెలిస్కోప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2008లో రియాజ్ అనే రియల్టర్ వద్ద కొనుగోలు చేసిన ఈ టెలిస్కోప్ 5 కిలోమీటర్ల దూరం వరకు దృష్టిని కేంద్రీకరిస్తుంది.

06/24/2016 - 05:48

హైదరాబాద్, జూన్ 23: ఏడుగురు ఐఎఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ ప్రదీప్ చంద్ర, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బిఆర్ మీనా, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా వికాస్ రాజ్, పంచాయితీరాజ్ జాయింట్ సెక్రటరీగా శ్రీ్ధర్, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ సిఇఓగా బసు, కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఎ దేవసేన, సిసిఎల్‌ఏ కార్యదర్శిగా కెకె ఎస్ రావును బదిలీ అయ్యారు.

06/24/2016 - 05:48

హైదరాబాద్, జూన్ 23: కొత్త జిల్లాల ఏర్పాటుపై టిఆర్‌ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈనెల 29న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐ సిసిలో టిఆర్‌ఎస్ ఎల్‌పి, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించనున్నారు.

06/24/2016 - 05:47

హైదరాబాద్, జూన్ 23: అంతరించి పోయిందనుకున్న పోలియో వైరస్ భయటపడడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. అంబర్‌పేటలో పోలియో వైరస్ వైరస్ వ్యాక్సినేటెడ్ డిరైవ్డ్ పోలియో వైరస్- టైప్ 2 నిర్మూలన వంద శాతం జరుగుతోందని, నిర్ణీత పోలియో కేంద్రాలు అన్నింటిలో వ్యాక్సినేషన్ జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు.

Pages