S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/21/2016 - 14:52

హైదరాబాద్: అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు ప్రమాదాల్లో చిక్కుకుని మరణించారు. వారాంతపు సెలవుల్లో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి వీరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన నంబూరి శ్రీదత్త ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ లోయలో పడి మరణించాడు.

06/21/2016 - 13:54

హైదరాబాద్‌: ప్రతి ఒక్కరం ఒక్కో మొక్క నాటుదాం- అనే నినాదంతో ముందుకు పోదామని మంత్రి కేటీఆర్‌ కోరారు. హరితహారంపై జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హెచ్‌ఎండీఏ, కంటోన్మెంట్‌ అధికారులు, ప్రైవేటు సంస్థలతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. జులై 11న 25లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

06/21/2016 - 12:49

హైదరాబాద్: నగరంలోని ఎల్‌బి నగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో అయిదేళ్ల విద్యార్థిని పట్ల అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సెక్యూరిటీ గార్డును అరెస్టు చేసి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. ఈ ఘటనపై విచారించి నిందితుడిని శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

06/21/2016 - 12:49

హైదరాబాద్: అమెరికాలోని ఓ వాటర్ ఫాల్స్ వద్ద లోయలో పడి హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన నంబూరి శ్రీదత్త మరణించినట్లు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రెండు రోజుల క్రితం శ్రీదత్త తన స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ వద్దకు విహార యాత్రకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ అతను లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీదత్త మూడేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు.

06/21/2016 - 12:48

హైదరాబాద్: శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడే యోగాను పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరి చేయాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఎల్‌బి స్టేడియంలో జరిగిన ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, భారతీయులకే సొంతమైన యోగాను నేడు ప్రపంచం యావత్తూ ఆచరిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

06/21/2016 - 11:39

హైదరబాద్‌: హైదరబాద్‌లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ను అరెస్ట్ చేసి కేజీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

06/21/2016 - 11:32

హైదరాబాద్‌: అంబర్‌పేట కుమ్మరివాడలో ఓ ఇంట్లో సిలిండర్‌ పేలి బాలుడు మృతి చెందారు. గాయపడిన ముంతాజ్, అజీజ్ అనే ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

06/21/2016 - 11:28

ఖమ్మం: గుర్తుతెలియని వ్యక్తిని కొందరు దుండగులు హత్యచేసి తగులబెట్టారు. వాజేడు మండలం ధర్మవరం అటవీప్రాంతంలో మృతదేహం లభ్యం అయింది.

06/21/2016 - 08:32

హైదరాబాద్, జూన్ 20: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండేళ్ల తర్వాత ఓ ప్రజాఉద్యమం ఊపిరి పోసుకుంది. ఈ రెండేళ్లలో విపక్షాలు వివిధ అంశాలపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా లభించని మద్దతు, మల్లన్నసాగర్ భూసేకరణపై రైతులు చేస్తున్న ఉద్యమానికి లభించడం విశేషం.

06/21/2016 - 08:31

హైదరాబాద్, జూన్ 20: రాజధాని నగరంలో రోడ్ల పరిస్థితి, రవాణా, పారిశుద్ధ్య పరిస్థితి మెరుగు పడేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు నేతృత్వంలో సోమవారం జరిగిన కీలక సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నగరానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేశారు.

Pages