S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/09/2016 - 15:43

హైదరాబాద్: ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేనివారు, తెలంగాణ ద్రోహులకు కెసిఆర్ మంత్రివర్గంలో పెద్దపీట వేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జెఎసీ నేత కోదండరామ్‌పై పలువురు మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నా కెసిఆర్ పెదవి విప్పడం లేదన్నారు.

06/09/2016 - 13:37

హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలకు అవసరమైన వైద్యసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి గురువారం తెలిపారు. ప్రస్తుతం వీణావాణి నగరంలోని నీలోఫర్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శస్తచ్రికిత్స చేసి వీరిని ఈ వయసులో విడదీయడం ప్రమాదకరమని దిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

06/09/2016 - 13:36

నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తన ఏకైక ధ్యేయమని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాను తెరాసలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలో రైతురాజ్యం రావాలన్నారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రచార ఆర్భాటం కోసం తెరాస సర్కారు చేసిన ఖర్చులపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

06/09/2016 - 13:35

నల్గొండ: ఇసుక కాంట్రాక్టర్‌కు అనుమతి పత్రాలు ఇచ్చేందుకు మూడువేల రూపాయలు లంచంగా తీసుకున్న ఆలేరు తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భిక్షపతిని ఎసిబి అధికారులు గురువారం పట్టుకున్నారు. నిందితుడిపై అధికారులు కేసు నమోదు చేశారు.

06/09/2016 - 07:38

మహబూబ్‌నగర్, జూన్ 8: మహబూబ్‌నగర్ జిల్లా రైతుల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరనుంది. జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా జొన్నలబోగుడ, గుడిపల్లిగట్టు ఎత్తిపోతల పథకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పనులు చివరి దశల్లో ఉండడంతో జూలై నెలాఖరు నాటికి రెండు లిఫ్టులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

06/09/2016 - 07:36

హైదరాబాద్, జూన్ 8 : మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం, బీమీ లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులను రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు.

06/09/2016 - 07:35

హైదరాబాద్, జూన్ 8 : తెలంగాణలో పరిశ్రమలతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి మంత్రి కె. తారకరామారావు కోరారు. వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న 40 మంది సక్సెస్‌ఫుల్ తెలంగాణ ఎన్నారైలతో బుధవారం ఆయన సిలికాన్ వ్యాలీలోని ఒక తెలంగాణ ఎన్నారై కంపెనీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ ఎన్‌ఆర్‌ఐలను ఆయన కోరారు.

06/09/2016 - 07:34

హైదరాబాద్, జూన్ 8: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను రెండుగా విభజించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌ను రెండు జోన్లుగా విభజించే ప్రక్రియ వేగవంతమైంది. కొత్తగా ఏర్పాటయ్యే జోన్లలో సరిహద్దు జిల్లాలనూ చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది. సైబరాబాద్‌ను వెస్ట్‌జోన్, ఉప్పల్ కేంద్రంగా ఈస్ట్‌జోన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

06/09/2016 - 06:45

హైదరాబాద్, జూన్ 8: విజయ దశమి (అక్టోబర్ 11) నాటికి కొత్త జిల్లాల సంపూర్ణ ఆవిర్భావ ప్రక్రియ పూర్తవుతుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాంటిచారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సిఎం రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసి ప్రకటించారు.

06/09/2016 - 06:43

హైదరాబాద్, జూన్ 8: యాభై నుంచి 60 వేల జనాభాకో మండలం, 10 మండలాలకో రెవిన్యూ డివిజన్, రెండు డివిజన్లతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. జిల్లాలు, మండలాల పునర్విభజనపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న కలెక్టర్ల కసరత్తును సిఎం బుధవారం సమీక్షించారు. కొత్త జిల్లాలు కోరుతూ వచ్చిన ప్రతిపాదనలను సిఎం కెసిఆర్ జిల్లాలవారీ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Pages