S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/09/2016 - 06:41

నిజామాబాద్, జూన్ 8: నిజామాబాద్ జిల్లాలో బుధవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు మృత్యువాతపడగా, నాగిరెడ్డిపేట మండలం బంజారతండా వద్ద టివిఎస్ మోపెడ్‌పై వెళ్తున్న వారిని ఇసుక లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

06/09/2016 - 06:20

హైదరాబాద్, జూన్ 8: ‘ఎన్ని అవాంతరాలు ఎదురైనా, దాడులు జరిగినా మా పోరాటం ఆగదు’ అని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి.జాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ‘మాకు ప్రజా ప్రయోజనాలు తప్ప రాజకీయ ప్రయోజనాలు లేవు. ప్రజల కోసం పని చేయడం, వారి పక్షాన నిలబడటం తప్ప ఏరకమైన ప్రయోజనాలు లేవు’ అన్నారు. ఎవరికో ఆగ్రహం వస్తుందని ప్రజా సమస్యలపై నిలదీయడం మానుకోవాలా? అని కోదండరామ్ ప్రశ్నించారు.

06/08/2016 - 17:25

హైదరాబాద్: ఒత్తిళ్లకు దూరంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జిల్లాల పునర్విభజన జరగాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త మండలాలు, జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరగాలన్నారు. కొత్త జిల్లాలు అభివృద్ధి కేంద్రాలుగా ఉండాలన్నారు.

06/08/2016 - 17:24

హైదరాబాద్: ప్రజాసమస్యలపై ప్రశ్నించిన జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై తెరాస మంత్రులు, నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడి చేయడం తగదని టి.బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమాధానాలు చెప్పే ధైర్యం లేకే తెరాస నేతలు ఇలా ప్రతిదాడికి దిగుతున్నారన్నారు. ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉందని, తెరాస సర్కారు మాత్రం నిరంకుశ ధోరణిలో ప్రవర్తిస్తోందన్నారు. ఫిరాయింపులకు వేదికగా తెలంగాణ సచివాలయం మారిందన్నారు.

06/08/2016 - 17:23

నిజామాబాద్: నవీపేట మండలం ఫకీరాబాద్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, ఆటోలో వీరు బాసర వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

06/08/2016 - 15:57

హైదరాబాద్: ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేందుకు టి.జెఎసిని మరింత బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కోదండరామ్ బుధవారం ప్రకటించారు. జెఎసి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాల్లో ఎన్నో సమస్యలు ప్రజలను వేధిస్తున్నట్టు తెలిపారు. వర్సిటీల్లో పాలన, ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు, కరవు పరిస్థితులు, భూ నిర్వాసితుల బాధలు, బలవంతపు భూ సేకరణ, సింగరేణి బొగ్గుగనుల్లో ఓపెన్ కాస్టింగ్..

06/08/2016 - 15:56

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెరాస ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఇక్కడ మాట్లాడుతూ, జెఎసి చైర్మన్ కోదండరామ్ అడిగే ప్రశ్నలకు బదులివ్వడానికి బదులు ఆయనపై తెలంగాణ మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం సరికాదన్నారు. ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేనివాళ్లు కూడా కోదండపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు.

06/08/2016 - 15:55

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయాలన్నదే జెఎసి ప్రధాన ఎజెండా అని ఆ సంస్థ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. తాను నలుగురికీ చెప్పగలిగే స్థితిలో ఉన్నానని, ఎవరి చేతో చెప్పించుకునే స్థితిలో లేనని ఆయన బుధవారం ఇక్కడ జెఎసి సమావేశంలో అన్నారు. విమర్శలను పట్టించుకోకుండా పనిచేస్తానని, జెఎసి వెనుక ఉన్నది ప్రజలేనని అన్నారు.

06/08/2016 - 13:06

వరంగల్: ఉమ్మడి హైకోర్టును విభజించాలని, స్థానికత ఆధారంగా న్యాయమూర్తులు, న్యాయాధికారులను బదిలీ చేయాలని కోరుతూ న్యాయవాదులు ప్రారంభించిన ఆందోళన బుధవారం మూడోరోజుకు చేరింది. ఇక్కడి హన్మకొండ కోర్టు ప్రాంగణంలో లాయర్లు భారీగా హాజరై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ఎపికి చెందిన జడ్జీలను వెనక్కి పంపాలని కోరారు.

06/08/2016 - 12:19

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం ఉదయం సచివాలయంలో కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష ప్రారంభించారు. జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల నుంచి నివేదికలను తీసుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఇదే విషయమై కలెక్టర్ల సమావేశంలో సిఎం కెసిఆర్ సమీక్షిస్తారు.

Pages