S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/02/2016 - 08:13

ఎల్లారెడ్డి, జూన్ 1: నదుల వాటాలను తేల్చాకే కృష్ణానది జలాలను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకోవాలని భారీ నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి పట్టణ శివారులోగల పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ శంకుస్థాపన కోసం మంత్రి హరీశ్‌రావు విచ్చేశారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్‌కూడా ఉన్నారు.

06/02/2016 - 07:39

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణను అస్థిర పరచడానికీ కుట్ర జరుగుతోందని, ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తెదేపాకు చెందిన మల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ అత్యవసరమన్నారు.

06/02/2016 - 07:37

హైదరాబాద్, జూన్ 1: మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఎమ్సెట్-2 నోటిఫికేషన్‌కు తొలి రోజు విశేష స్పందన కనిపించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావు వెల్లడించారు. తొలి రోజు 6వేల మంది దరఖాస్తు చేశారు. ఎమ్సెట్-2 మెడికల్ స్ట్రీం దరఖాస్తులను బుధవారం నుండి స్వీకరిస్తున్నారు.

06/02/2016 - 07:36

తెలంగాణ ధగధగలాడుతోంది. పట్టుబట్ట కట్టి పండుగ జరుపుకోవడానికి రాష్ట్రం మొత్తం ముస్తాబైంది. రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లు పూరె్తై మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే సంబురాలకు చిన్నా పెద్దా ముసలీ ముతకా సన్నద్ధమైంది. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకుంటోంది. ప్రత్యేక ఉద్యమ ఫలాన్ని పదిమందితో కలిసి పంచుకుని పండువ చేసుకోవడానికి ఉత్సాహం చూపుతోంది.

06/02/2016 - 06:28

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు చర్యలను ఆ రాష్ట్ర సిఎం కె చంద్రశేఖర్‌రావు, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు.

06/01/2016 - 18:06

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా నగరంలోని సంజీవయ్య పార్కులో గురువారం సిఎం కెసిఆర్ భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే సంజీవయ్య పార్కులో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపడుతూ సందర్శకులను అనుమతించడం లేదు.

06/01/2016 - 17:24

హైదరాబాద్‌ : కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేలకుండా ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవద్దని, కృష్ణా యాజమాన్య బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని కేంద్ర మంత్రి ఉమాభారతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్ర వాటా కోసం ఇప్పటికే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించామని..

06/01/2016 - 14:28

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో కొందరు అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన గోపి అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనను పోలీసులు అకారణంగా కొట్టారని మనస్తాపం చెందిన గోపి పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.

06/01/2016 - 14:28

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళి అర్పించేందుకు ఓయు విద్యార్థులు తలపెట్టిన బైక్ ర్యాలీని బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. నవ తెలంగాణ విద్యార్థి సంఘం నేతృత్వంలో ఓయు ఆర్ట్సు కాలేజీ నుంచి గన్‌పార్కు వరకూ ర్యాలీ జరపాలని విద్యార్థులు భావించారు. ర్యాలీ ఎన్‌సిసి గేటు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

06/01/2016 - 12:27

కరీంనగర్: స్నానం చేద్దామని వచ్చి మానేరు జలాశయంలో మునిగి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బుధవారం ప్రాణాలు కోల్పోయారు. జ్యోతినగర్‌కు చెందిన వరుణ్, సునంద్ జలాశయంలో స్నానం చేస్తూ కనిపించకుండా పోయారు. కాసేపటికి స్థానికుల సహాయంతో జలాశయంలో గాలించగా ఇద్దరి మృతదేహాలను లభించాయి. సునంద్ హైదరాబాద్‌లో, వరుణ్ కరీంనగర్‌లో ఇంటర్ చదువుతూ సెలవులకు జ్యోతినగర్ వచ్చారు.

Pages