S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/29/2016 - 05:38

హైదరాబాద్, మే 28:నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు శనివారం ఉదయానికి ఒక టిఎంసి కృష్ణా జలాలు చేరుకున్నాయి. గత వారం రోజుల నుంచి నీటివిడుదల ప్రారంభం కాగా, వారం రోజుల్లో ఒక టిఎంసి నీరు పూర్తయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి అవసరాల కోసం కర్నాటక ఒక టిఎంసి నీటిని విడుదల చేయడానికి ఈనెల 20న అంగీకరించింది. అదే రోజు నీటివిడుదలకు అవసరం అయిన చర్యలు తీసుకుంది.

05/29/2016 - 05:37

హైదరాబాద్, మే 28:దేశంలో కెల్లా ఎత్తయిన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎయిర్ పోర్ట్ అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జాతీయ పతాకం ఎత్తు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో జూన్ రెండవ తేదీన 303 అడుగుల ఎత్తయిన జెండా ఆవిష్కరించాలని ప్రభుత్వం తొలుత భావించింది.

05/29/2016 - 04:17

హైదరాబాద్, మే 28:తెలంగాణతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయిన డ్రీమ్ వర్క్స్ తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంపిక చేసుకుంది. పెట్టుబడులను ఆకర్శించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తన ఐదవ రోజు పర్యటనలో లాస్ ఎంజెల్స్‌లో వివిధ సంస్థలను కలిశారు.

05/28/2016 - 17:58

నల్గొండ: పెద్దవూర మండలం ఈదులగూడెంలో శనివారం ఈదురుగాలులకు రేకులషెడ్డు కూలి 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు, కుమార్తె పరిస్థితి విషమం ఉంది.

05/28/2016 - 17:54

ఆదిలాబాద్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే న్యూటెక్ బొగ్గుగనిలో శనివారం బొగ్గు పెళ్లలు పడి ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

05/28/2016 - 17:52

హైదరాబాద్: కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో బ్లడ్‌ మాఫియా కేసులో శనివారం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు నరేంద్ర ఇచ్చిన సమాచారంతో నిందితులను సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

05/28/2016 - 16:55

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. క్యాంపస్‌లోని టెంట్‌ను, వేముల రోహిత్, అంబేద్కర్ చిత్రపటాలను సెక్యూరిటీ సిబ్బంది తొలగించడం దారుణమని విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. రోహిత్ ఆత్మహత్యకు కారకుడైన వీసీ అప్పారావును తక్షణం బాధ్యతల నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు.

05/28/2016 - 15:52

హైదరాబాద్: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశంలో నిర్ణయించారు. రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహపడినా సంఖ్యాబలం లేనందున బరిలో నిలిచినా ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

05/28/2016 - 12:21

మెదక్: కల్హేర్ మండలం నాజ్‌గఢ్ వద్ద శనివారం ఉదయం ఇసుక పెళ్లలు విరిగి మీద పడడంతో ఇద్దరు కూలీలు మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు.

05/28/2016 - 12:20

హైదరాబాద్: ఉస్మానియా నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో శనివారం ఉదయం కలుషిత ఆహారం తినడంతో పదిమంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pages