S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/12/2016 - 12:01

హైదరాబాద్: సీనియర్ నటుడు గిరిబాబు భార్య శ్రీదేవి (70) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గిరిబాబుకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రకాశం జిల్లా రావినూతలలో అంత్యక్రియలు జరుగుతాయి. పలువురు సినీ ప్రముఖులు గిరిబాబు భార్య మరణం పట్ల సంతాపం తెలిపారు.

05/12/2016 - 08:46

హైదరాబాద్, మే 11: తెలంగాణ రాష్ట్ర సమితిలో తాను చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. తనకు ఎంతో బాధ్యతాయుతమైన, అత్యంత ప్రధానమైన పార్టీ అధ్యక్ష పదవిని, ఎనలేని గౌరవాన్ని ఇచ్చిన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ వీడనని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

05/12/2016 - 08:45

వరంగల్, మే 11: ఎట్టకేలకు ఈ వేసవిలో ఓరుగల్లు ప్రజలకు తాగునీటి కటకట లేకుండా పోయింది. వరంగల్ మహానగర పాలక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు తాగునీటి అవసరాలు పూర్తి స్థాయిలో తీరాయి. బుధవారం ఉదయం ధర్మసాగర్ చెరువులోకి గోదావరి జలాలు చేరుకున్నాయి.

05/12/2016 - 08:44

వరంగల్, మే 11: వరంగల్ నగరంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు బుధవారం నాల్గవ రోజుకు చేరుకున్నాయి. శంకర జయంతి సందర్భంగా ఉదయం అమ్మవారికి ఉషః కాలార్చన పూర్తయిన అనంతరం జగద్గురు శంకరాచార్య జయంతిని భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన, ఉత్సవంగా నిత్యబలి పూర్తి చేసి అమ్మవారిని దుర్గామాతగా అలంకరించి సింహ వాహనంపై ఊరేగించారు.

05/12/2016 - 05:56

హైదరాబాద్, మే 11: టెన్త్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో బుధవారం విడుదల చేశారు. జిల్లాలవారీ ఫలితాల్లో వరంగల్ జిల్లా అగ్రగామిగా నిలిస్తే, చివరి స్థానంలో హైదరాబాద్ ఉంది. గత మార్చి 21నుండి జరిగిన పరీక్షలకు రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్ధులు 5,55,265 మంది హాజరయ్యారు. ఇందులో 5,19,494 మంది రెగ్యులర్ అభ్యర్ధులు కాగా 35,771 మంది ప్రైవేటు అభ్యర్ధులు.

05/12/2016 - 05:52

హైదరాబాద్, మే 11: హైదరాబాద్ నగర శివారులోని పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అకృత్యాలకు పాల్పడ్డారన్న నేరంపై 8మంది స్నేక్ గ్యాంగ్ దోషులకు రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. ఏ1 నుంచి ఏ7 నిందితులకు జీవిత ఖైదు విధించగా, ఏ8 నిందితుడు ఇంతకు ముందే 22 నెలల శిక్ష అనుభవించినందున అతనికి 20 నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

05/12/2016 - 05:43

హైదరాబాద్, మే 11: తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రైవేటు కాలేజీలు పూర్తిచేశాయి. ఏటా ఇంటర్ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. దాని ప్రకారమే ఆయా ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు చేపట్టాల్సి ఉన్నా, గత నెల 9న టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు చేపట్టాయి.

05/11/2016 - 17:03

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో పలు అకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌లో మొదటి ఏడుగురు నిందితులకు యావజ్జీవ జైలుశిక్షను రంగారెడ్డి జిల్లా కోర్టు ఖరారు చేసింది. 8వ నిందితుడికి 20 నెలల జైలుశిక్షను విధించారు. ఈ కేసులో మంగళవారం వాదనలు ముగిశాక బుధవారం నాడు న్యాయమూర్తి శిక్షలను ప్రకటించారు.

05/11/2016 - 12:35

హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణలో జరిగిన టెన్త్ పరీక్షల్లో 85.63 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఇక్కడ విడుదల చేశారు. వరంగల్‌ జిల్లా 95.13 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానంలో నిలిచింది. రాజధాని నగరం హైదరాబాద్‌ 76.23 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,55,265 మంది విద్యార్థులు హాజరుకాగా 4,44,828 మంది ఉత్తీర్ణులయ్యారు.

05/11/2016 - 12:32

హైదరాబాద్: విమానాల్లో సీట్లకు మించి టిక్కెట్లను విక్రయించడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం నాడు ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. దిల్లీ, ముంబయి, లక్నో, చెన్నై వెళ్లాల్సిన విమానాల్లో సీట్లకు మించి ఇండిగో ఎయిర్‌లైన్స్ టిక్కెట్లను విక్రయించింది. దీంతో చాలామంది ప్రయాణీకులను విమానాల్లోకి అనుమతించలేదు.

Pages