S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/10/2016 - 02:06

కరీంనగర్, మే 9: వచ్చే దసరా పండుగ నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని, అయితే, ఎన్ని జిల్లాలు అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు.

05/10/2016 - 02:03

మహబూబ్‌నగర్, మే 9: కొడుకా రా.. కుర్చీ వేశాను. నువ్వు ఆటంబాంబువైతే, మేము కాంగ్రెస్ చిచ్చర పిడుగులం.. అంటూ ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సిఎం కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీఎస్ ప్రాజెక్టు ఆనకట్ట పెంచాలంటూ కాంగ్రెస్ పార్టీ సోమవారం మహాదీక్ష నిర్వహించింది.

05/10/2016 - 01:57

జడ్చర్ల, మే 9: రాష్ట్ర ప్రభుత్వం కరవును విస్మరించి, కమీషన్లపైనే దృష్టి పెట్టిందని పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధనూర్‌లో అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కమార్ సోమవారం తలపెట్టిన దీక్షకు హైదరాబాద్ నుండి వెళ్తున్న ఆయన జడ్చర్లలోని జాతీయ రహదారిపై ఆగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు.

05/10/2016 - 01:55

కల్చరల్ (వరంగల్), మే 9: వరంగల్ నగరంలో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవాలయంలో భద్రకాళీ భద్రేశ్వర్లు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం రెండవ రోజు అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

05/10/2016 - 01:52

సంగారెడ్డి, మే 9: ప్రకృతి వైపరీత్యాలతో పశువులను కాపాడుకునేందుకు అన్నదాతలు అనేక అవస్థలు పడుతుంటే విద్యుత్ తీగలు మూగజీవాల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. గంటల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు సంఘటనల్లో 29 పశువులు మృత్యువాత పడ్డాయి. మెదక్ జిల్లాలోని కల్హేర్, న్యాల్‌కల్ మండల్లాల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో పాడి రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే..

05/10/2016 - 01:47

వరంగల్, మే 9: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో జరిగిన తెలంగాణ విద్వత్ పరిషత్ ద్వితీయ వార్షికోత్సవ వేద విద్వత్ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

05/10/2016 - 01:44

ఖమ్మం, మే 9: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ సమయం సమీపిస్తున్నకొద్దీ మాటలకు పదునుపెడుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్, వామపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే తామని, రెండేళ్లలో చేసింది శూన్యమంటూ టిఆర్‌ఎస్ నేతల వైఖరిపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.

05/09/2016 - 18:07

హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళతానని ఓ వర్గం మీడియాలో తెరాస పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. తెలంగాణలో ప్రజాసమస్యలపై కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సి ఉందన్నారు.

05/09/2016 - 17:48

ఖమ్మం: గోదావరి జలాల పంపిణీ విషయంలో ఎపి సిఎం చంద్రబాబు, వైకాపా అధినేత జగన్ తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆంధ్రా నేతల నీటి రాజకీయాలను అడ్డుకుంటామన్నారు. పాలేరు ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.

05/09/2016 - 17:46

హైదరాబాద్: హయత్‌నగర్ మండలం కోహెడలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న పాత నేరస్థులు వీరాస్వామి, సురేందర్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేసి లక్షన్నర రూపాయల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

Pages