S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/02/2016 - 16:52

మెదక్: దేగుల్‌వాడీ తండాలో విద్యుత్ షాక్‌తో మరణించిన వారి కుటుంబాలను మంత్రి హరీష్ రావు సోమవారం పరామర్శించారు. ఆదివారం రాత్రి పెళ్లి బృందానికి చెందిన లారీ వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు వేలాడుతున్నా చర్యలు తీసుకోని విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

05/02/2016 - 16:51

ఆదిలాబాద్: వడదెబ్బకు గురై, తాగేందుకు మంచినీళ్లు దొరక్క ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్నూరు మండలం ముద్దారం అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. లింగంపల్లి నుంచి ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు అటవీప్రాంతం గుండా నడిచి వెళ్తుండగా దాహార్తి సమస్య వీరిని వెంటాడింది.

05/02/2016 - 16:49

నల్గొండ: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతోపాటు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుర్రంపాడు మండలం జూనూతలలో సోమవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

05/02/2016 - 14:50

ఖమ్మం: తెలంగాణలో వైకాపా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎంపీ పొంగులేటి తన అనుచరులు, వైకాపా కార్యకర్తలతో సోమవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే ఆయన తన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

05/02/2016 - 14:50

కరీంనగర్: తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల నుంచి గతంలో కేటాయించిన విధంగానే 1,300 టీఎంసీల నీటిని ఆరునూరైనా వాడుకుని తీరతామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణకు 1,300 టిఎంసీలను కేటాయించారని గుర్తు చేశారు.

05/02/2016 - 14:49

హైదరాబాద్: కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు దండుకునేందుకే తెరాస ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు డిజైన్లను మారుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా డిజైన్ల మార్పు పేరుతో తెరాస నేతలు కాసులు దండుకుంటున్నారని అన్నారు. పాలమూరు ప్రాజ్టెక్టు వ్యయాన్ని అనూహ్యంగా పెంచడంలో అంతరార్థం ఇదేనని అన్నారు.

05/02/2016 - 14:48

కరీంనగర్: కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ దంపతులు సందర్శించి అర్చనలు జరిపారు. వీరికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో కెసిఆర్ దంపతులు బంగారు కిరీటం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత కనే్నపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణానికి సిఎం భూమిపూజ చేశారు.

05/02/2016 - 11:48

కరీంనగర్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇక మంచిరోజులు ఖాయమని సిఎం కెసిఆర్ సోమవారం కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా అన్నారు. కాళేశ్వరం పూర్తయితే ఉత్తర తెలంగాణకు నీటికష్టాలు ఉండవన్నారు. ప్రాజెక్టులను ఎవరూ అడ్డుకోలేరని ఆయన విపక్ష నేతలనుద్దేశించి అన్నారు. ప్రాజెక్టుల విషయమై కాంగ్రెస్ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేస్తామనడం అవివేకమన్నారు.

05/02/2016 - 06:24

మహబూబ్‌నగర్, మే 1: కెనడా దేశం టోరంటోలో స్థిర నివాసం ఉంటున్న పాలమూరు పట్టణానికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పాలమూరుకు చెంనిన జాన్ కృపావరం, శోభ దంపతులు ఉద్యోగ రీత్యా టోరంటోలో ఉంటున్నారు. వీరి మొదటి కుమార్తె సింథియాజాన్ (24) ఆదివారం తెల్లవారుజామున ఓ శుభకార్యానికి హాజరై ఇంటికి వస్తూ మార్గమధ్యంలో షాపింగ్ చేసేందుకు మాల్‌కు వెళ్లింది.

05/02/2016 - 06:22

సంగారెడ్డి, మే 1: ఉదయం నుండి సాయంత్రం వరకు వివాహ శుభ కార్యక్రమంలో ఆనందంగా గడిపి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన పెళ్లి బృందం వాహనానికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు యమపాశమై కటికచీకట్లలో ఎనిమిది మంది ప్రాణాలను అపహరించాయి. మరో 14 మంది మృత్యువుతో చెలగాటమాడుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు..

Pages