S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/14/2016 - 14:31

హైదరాబాద్: ఒకపార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మరోపార్టీలోకి ఫిరాయించడం అతి హేయమైన చర్య అని, ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయని టి.అసెంబ్లీలో కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ, తమ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెరాసలో చేరడం అప్రజాస్వామికమన్నారు. ఫిరాయింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అసెంబ్లీ స్పీకర్ ఏ మాత్రం స్పందించడం లేదన్నారు.

04/14/2016 - 14:31

హైదరాబాద్: కెసిఆర్ క్యాబినెట్‌లో దళితులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒకరోజు దీక్ష ప్రారంభించారు. సిఎం కెసిఆర్ దళితుల పట్ల అంటరానితనం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు పదవులిచ్చేందుకు జూన్ 2లోగా నిర్ణయం తీసుకోని పక్షంలో తన ఆందోళనను తీవ్రతరం చేస్తానన్నారు.

04/14/2016 - 12:13

హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్మించే టవర్‌కు తెలంగాణ సిఎం కెసిఆర్ గురువారం ఉదయం భూమిపూజ చేశారు. విగ్రహం ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కెసిఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు నివాళులర్పించారు.

04/14/2016 - 12:11

హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం ఆయనకు ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, మంత్రులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సిఎం మహముద్ అలీ, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి, టి.అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ మధుసూదనాచారి పూలమాలలు వేశారు.

04/14/2016 - 12:11

ఖమ్మం: శ్రీరామనవమికి ఒకరోజు ముందే భద్రాచలం పుణ్యక్షేత్రానికి గురువారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం క్యూలైన్లతో నిండిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు.

04/14/2016 - 08:08

హైదరాబాద్, ఏప్రిల్ 13: క్రమబద్ధీకరణ పేరిట రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మూసి వేసే కుట్ర చేస్తున్నదని బిజెపి నూతన అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. కార్పొరేట్ విద్యా సంస్ధలకు ప్రభుత్వం కొమ్ముకాస్తున్నదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

04/14/2016 - 08:08

బెల్లంపల్లి, ఏప్రిల్ 13: సింగరేణి బొగ్గు గని మరో ముగ్గురు కార్మికులను బొగ్గు పొరల్లో ఇముడ్చుకుంది. విధుల్లోకి వెళ్లిన కార్మికులు ఊహించని విధంగా బొగ్గు బావిలో ప్రమాదానికి గురైన హృదయ విదారక సంఘటన శాంతిఖని బొగ్గు గనిపై కార్మికులను నివ్వెరపరిచింది.

04/14/2016 - 08:07

సంగారెడ్డి, ఏప్రిల్ 13: ఉపాధి బరువై బతుకు భారమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అందించిన చేయూత, అధికారులు అందిస్తున్న సహకారానికి అంగవైకల్యంలో ఏ మాత్రం అడ్డురాదని నిరూపిస్తూ అందరికీ ఆదర్శవంతమైన సోలార్ పరికరాలను ఉత్పత్తి చేస్తూ స్వశక్తితో స్వయం ఉపాధి పొందుతున్నారు.

04/14/2016 - 08:06

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 179 కమిటీలు ఉండగా, 11షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్నాయి. మిగిలిన 168 కమిటీల్లో మహిళలకు 55 కేటాయించి, జనరల్‌కు 113 కేటాయించారు.

04/14/2016 - 07:58

భద్రాచలం, ఏప్రిల్ 13: ఖమ్మం జిల్లా శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ముందుగా ప్రాకారమంటపంలో అగ్నిని మథించి యాగశాలలోని అగ్నిగుండంలో ప్రవేశపెట్టారు. తర్వాత గరుత్మంతుడిని మేల్కొలిపి గరుడ కుంభాన్ని శిరస్సుపై ధరించి వేదపండితులు దేవాలయం చుట్టూ తిరుగుతూ ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు.

Pages