S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/13/2016 - 16:44

ఆదిలాబాద్: మంచిర్యాల వద్ద సింగరేణి బొగ్గు గనుల్లో బుధవారం ఓ బండరాయి కిందపడగా ముగ్గురు కార్మికులు మరణించారు. శాంతిఖనిలో 20 మంది కార్మికులు బొగ్గును తవ్వుతుండగా ఆకస్మికంగా పైకప్పు కదిలి ఓ బండరాయి కిందపడింది. బండరాయి కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 8 మీటర్ల పొడవు,12 మీటర్ల వెడల్పు ఉన్న బండరాయి ఒక్కసారిగా కిందపడిందని కార్మికులు చెబుతున్నారు.

04/13/2016 - 16:43

హైదరాబాద్: హిందూ దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం విషయమై కోర్టులు తీర్పులివ్వడం సరికాదని శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం మంచిదికాదన్నారు. మసీదుల్లో మహిళల ప్రవేశానికి కోర్టులు తీర్పులు ఇస్తాయా? అని ఆయన ప్రశ్నించారు.

04/13/2016 - 16:41

హైదరాబాద్: దళితులంటే ఏ మాత్రం గౌరవం ఇవ్వని తెలంగాణ సిఎం కెసిఆర్ అంటరానితనాన్ని పాటిస్తున్నారని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. దళితులకు క్యాబినెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడంలో అర్థం లేదన్నారు. గొప్ప కోసం భారీ విగ్రహాలు పెడితే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.

04/13/2016 - 16:40

మెదక్: డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ ఉన్మాది తల్లి, తమ్ముళ్లు, మరదలిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన కోనాపూర్‌లో బుధవారం జరిగింది. కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న కుంచెం బాలయ్య తనకు డబ్బులు కావాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వారు అందుకు అంగీకరించనందున ఇద్దరు తమ్ముళ్లపైన, అడ్డువచ్చిన తల్లి, మరదలిపైనా దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన నలుగురినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

04/13/2016 - 16:38

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం తెలంగాణ సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. సిఎం క్యాంప్ ఆఫీసులో కెసిఆర్‌ను కలిశాక తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

04/13/2016 - 13:55

ఖమ్మం: శ్రీరామనవమి సమీపిస్తున్నప్పటికీ భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయంలో పనులు పూర్తికానందుకు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి దేవస్థానం ఇవో కె.జ్యోతి, డిఇ రవీంద్రనాథ్‌లపై మండిపడ్డారు. భక్తుల కోసం నిర్మిస్తున్న చలువ పందిళ్లపై తాటాకులు సరిగా వేయలేదని మంత్రి కోపగించుకున్నారు. రెండు ఆకులు పడేస్తే చలువపందిళ్లు అవుతాయా?

04/13/2016 - 13:54

హైదరాబాద్: తెలంగాణలో అధికార తెరాస పార్టీలోకి విపక్ష ఎమ్మెల్యేల వలసలకు ఇంకా తెరపడడం లేదు. ఇన్నాళ్లూ టిడిపి ఎమ్మెల్యేలు ‘క్యూ’ కట్టి మరీ తెరాసలో చేరగా, ఇపుడు కాంగ్రెస్ వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెరాసలో చేరేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.

04/13/2016 - 13:11

హైదరాబాద్: నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి పలు అంశాలపై బుధవారం ఉన్నతస్థాయిలో సమీక్షా సమావేశం ప్రారంభమైంది. బిల్డర్లు, ఆర్థిక సహాయ సంస్థలు, గృహ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

04/13/2016 - 13:10

హైదరాబాద్: రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా వేడి ఉంటోంది గనుక వేసవి ప్రతాపం బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వడగాలుల జోరు అధికంగా ఉంటుంది.

04/13/2016 - 13:09

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన గోడౌన్‌లో బుధవారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఆర్టీసీ డిపో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Pages