S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/13/2016 - 13:09

హైదరాబాద్: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సును నడుపుతున్న బిహెచ్‌ఇఎల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. బుధవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు కూకట్‌పల్లి వద్ద తనిఖీలు చేస్తూ సెల్‌లో మాట్లాడుతుండగా డ్రైవర్‌ను పట్టుకున్నారు.

04/13/2016 - 13:08

హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని కెనరాబ్యాంకు ఎటిఎంలో నగదును చోరీ చేసేందుకు మంగళవారం అర్ధరాత్రి దొంగలు విఫలయత్నం చేశారు. ఎటిఎంను ధ్వంసం చేసినా నగదు లభించకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. చోరీకి యత్నించిన వారికోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.

04/13/2016 - 13:08

హైదరాబాద్: నగరంలోని కుల్సుంపుర కబేళా వద్ద బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో 20 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. ఇళ్లలో సామగ్రి, నగదు, బంగారం కాలిపోవడంతో బాధితులు వీధిపాలయ్యారు.

04/13/2016 - 08:49

నల్లగొండ/మహబూబ్‌నగర్/నిజామాబాద్/ఆదిలాబాద్/కరీంనగర్, ఏప్రిల్ 12: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో వడదెబ్బతో ఎనిమిది మంది మరణించారు.

04/13/2016 - 08:36

పాన్‌గల్, ఏప్రిల్ 12: వడదెబ్బతో భర్త మృతి చెందడంతో అతని అంత్యక్రియలు నిర్వహిస్తుండగా భార్య గుండె ఆగి మృతి చెందింది. ఈ మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

04/13/2016 - 08:36

హైదరాబాద్, ఏప్రిల్ 12: అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మంగళవారం నిర్వహించిన సభ విజయవంతమైంది. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలి రావడంతో సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ క్రిక్కిరిసింది. దీంతో పార్టీ నాయకులే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎఐసిసి నాయకుడు, వి.హనుమంతరావు ప్రసంగంలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారని అనుకోలేదన్నారు.

04/13/2016 - 08:35

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాజకీయలబ్ధి కోసం కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరిన నాయకులను మళ్లీ రానిచ్చే ప్రసక్తే లేదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఫిరాయింపుదారులకు అధికారమే ముఖ్యమని ఆయన విమర్శించారు.

04/13/2016 - 07:01

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్రంలో ప్రతీ 75 వేల జనాభాకు ఒకటి చొప్పున అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న 104 సంచార వైద్య వాహనాల సేవలు మరింత విస్తృతపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

04/13/2016 - 06:56

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతి ఆయోగ్ సలహాదారు పికె ఝా, డిప్యూటీ అడ్వైజర్ ఎకె జైన్‌లు అభినందించారు. పథకాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో అధికారులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

04/12/2016 - 18:02

హైదరాబాద్: ఇక్కడ మంగళవారం జరిగిన తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సమావేశంలో గందరగోళం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. హౌసింగ్ సొసైటీ స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగినందున ప్లాట్ల కేటాయింపును రద్దు చేయాలని ఓ వర్గం వాదించింది. దీన్ని మరో వర్గం వ్యతిరేకించడంతో ఘర్షణ జరిగింది.

Pages