S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/11/2016 - 12:06

హైదరాబాద్: రోగులకు, వారివెంట వచ్చే సహాయకులకు వేసవిలో దాహార్తి తీర్చేందుకు పంజగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో అంబలి కేంద్రాన్ని సోమవారం తెలంగాణ దేవాదాయమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ ఏడాది కూడా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులు, తెరాస నేతలు పాల్గొన్నారు.

04/11/2016 - 12:06

మహబూబ్‌నగర్: వంగూరు మండలం కోనేటిపూర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డుపై ఆగిఉన్న టిప్పర్ లారీని కల్వకుర్తి వైపు వెళుతున్న ఆటో ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కోనేటిపూర్ చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించారు.

04/11/2016 - 12:05

సిద్ధిపేట: సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు అఖండ విజయం సమకూర్చిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఎన్నికల్లో తెరాస తిరుగులేని మెజార్జీ సాధించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్ధిపేట ఎమ్మెల్యేగా తాను స్థానికుల అవసరాలను తీర్చేందుకు ఎల్లవేళలా శ్రమిస్తానన్నారు. పార్టీ ప్రస్తావన లేకుండా విజేతలందరినీ ఆయన అభినందించారు.

04/11/2016 - 12:04

మెదక్: సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. 28 వార్డులకు గత వారం పోలింగ్ నిర్వహించగా, సోమవారం ఉదయం కౌంటింగ్ జరిగింది. 34 వార్డులున్న సిద్ధిపేట కౌన్సిల్‌లో ఇదివరకే ఆరు వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. పోలింగ్ జరిగిన 28 వార్డుల్లో తెరాసకు 18, కాంగ్రెస్‌కు, బిజెపికి రెండేసి, ఎంఐఎంకు ఒక స్థానంలో గెలుపు దక్కింది.

04/11/2016 - 12:04

నల్గొండ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో మేటిచందాపురం గ్రామసర్పంచ్ రాములమ్మ (65) ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సోమవారం వెలుగుచూసింది. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

04/11/2016 - 12:03

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో బ్యూటీపార్లర్ పేరిట వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న ముగ్గురు నిర్వాహకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి పంపారు.

04/11/2016 - 08:21

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీడిజైన్ విధివిధానాలను బహిర్గతం చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం నాచారంలోని హెచ్‌ఎంటి నగర్‌లో టిజెఎసి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు.

04/11/2016 - 08:12

కరీంనగర్, ఏప్రిల్ 10: మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి, నిజామాబాద్ మాజీ ఎంపి మధుయాష్కి డిమాండ్ చేశారు.

04/11/2016 - 08:11

సంగారెడ్డి, ఏప్రిల్ 10: రాజుల కాలం నాటి చరిత్రను ఇముడ్చుకున్న మెదక్ జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామానికి మహా చరిత్ర ఉన్నట్లు అక్కడ లభిస్తున్న వివిధ రకాల అద్భుతమైన దేవతా విగ్రహాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

04/11/2016 - 08:10

హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 10: కరీంనగర్ జిల్లాలో కాకతీయ ప్రధాన కాలువ మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాలువ ఆధునీకరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.130 కోట్లు మంజూరు చేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు కాకతీయ కాలువ ద్వారా ఎల్ ఎండిలోకి వస్తోంది. అలాగే ఎల్‌ఎండి నుండి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాలకు సాగునీరు 3.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందుతోంది.

Pages