S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/09/2016 - 04:05

విశాఖపట్నం, ఏప్రిల్ 8: విశాఖపట్నం జిల్లా మన్యం నుంచి బాక్సైట్ ముడి ఖనిజం తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

04/08/2016 - 16:27

హైదరాబాద్:బారతీయ జనతాపార్టీ ఐదు రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు ప్రకటించింది. తెలంగాణకు ప్రస్తుత బిజెపి శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పంజాబ్‌కు విజయ్‌సంప్లా, ఉత్తర్‌ప్రదేశ్‌కు కేశవ్‌ప్రసాద్ వౌర్య, అరుణాచల్ ప్రదేశ్‌కు తేపిగోడ్, కర్ణాటకకు మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్పలను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

04/08/2016 - 16:25

హైదరాబాద్:తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది వెలుగులు తెస్తుందని, పంచాంగం ఒక మార్గదర్శి అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ విద్యారంగంలో కొన్ని ఇబ్బందులు వస్తాయని, క్రమశిక్షణతో వాటిని ఎదుర్కొవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ అర్చకులను సన్మానించారు.

04/08/2016 - 13:22

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దుర్ముఖినామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని సిఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు ప్రజలకు అందాలని, రాష్ట్రం సుభిక్షం కావాలని సిఎం అన్నారు.

04/08/2016 - 13:19

హైదరాబాద్, ఏప్రిల్ 7: టిఆర్‌ఎస్ ప్లీనరీ కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించాలనే వ్యూహంలో భాగంగా ఖమ్మంలో ఈ నెల 27న ప్లీనరీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం ఈ రెండు జిల్లాల్లో మొదటి నుంచి టిఆర్‌ఎస్ బలహీనంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో అనూహ్యంగా పుంజుకున్న టిఆర్‌ఎస్ ఖమ్మంపై దృష్టిసారించింది.

04/08/2016 - 13:19

హైదరాబాద్, ఏప్రిల్ 7: వ్యవసాయ రంగం, పేద వర్గాల వారికి ఇస్తున్న విధంగానే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఇవ్వాలని తెలంగాణ ఫ్యాప్సీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిని కోరారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం మొత్తం సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి నిర్దేశించినట్లుగా కాకుండా, తక్కువ సబ్సిడీని విద్యుత్ సంస్థలకు మంజూరు చేసిందన్నారు.

04/08/2016 - 13:18

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఏడాది కాలంలో దేవాదుల ప్రాజెక్టు పూర్తవుతుందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం తెలిపారు. మిషన్ కాకతీయను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా భావించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు.

04/08/2016 - 13:16

హైదరాబాద్, ఏప్రిల్ 7: అభరణాలు రూపొందించే నలుగురు వ్యక్తులు దాదాపు ఆరు కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. భారీ ఎత్తున జరిగిన ఈ వ్యవహారం గత నెలలోనే జరిగినా ఇప్పటివరకు పోలీసులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. ఆభరణాల తయారీదారులు ఎత్తుకెళ్లిన బంగారం మొత్తం 6 కిలోలా లేక తక్కువగా తీసుకువెళ్లి ఎక్కువచేసి చెబుతున్నారా అనే విషయంపై పోలీసులు స్పష్టంగా చెప్పడం లేదు.

04/08/2016 - 13:16

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఎత్తును పెంచేందుకు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు నిఖిల్‌రెడ్డికి నిర్వహించిన ఆపరేషన్ అరుదైన ఆపరేషన్ అని అనైతికమైనది కాదని తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

04/08/2016 - 13:15

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణలో వివిధ విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీ బాధ్యతను ప్రభుత్వం పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించనుంది. ఐదు విభాగాల్లో ఉన్న 2444 పోస్టులను భర్తీ చేసేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఎస్సీ సంక్షేమ శాఖలో 12 ప్రిన్సిపాల్ పోస్టులు, 560 టిజిటిలు, 79 పిఇటిలు, 52 ఆర్టు/మ్యూజిక్ టీచర్లు, మూడు క్రాఫ్ట్ టీచర్లు, 34 లైబ్రరియన్లు, 18 స్ట్ఫా నర్సు పోస్టులు భర్తీ చేస్తారు.

Pages