S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/11/2016 - 11:53

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపుకోవచ్చు. పూర్తి వివరాలను తీతీతీ.ఆఒఔఇ.జశ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

01/11/2016 - 06:46

హైదరాబాద్, జనవరి 10: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల వేడి రాజుకుంది. మేయర్ పీఠానే్న పార్టీలన్నీ టార్గెట్ చేస్తున్నాయి. మేయర్ పదవి బీసీ జనరల్ కావడంతో డివిజన్లవారీగా అభ్యర్థుల ఎంపిక సమయంలోనే మేయర్ పదవికి ఎవరు సరైన అభ్యర్థి అనే ఆలోచన చేస్తున్నారు.

01/11/2016 - 06:43

హైదరాబాద్, జనవరి 10: అమెరికాలో తెలుగు విద్యార్థులకు కష్టాలు తప్పడంలేదు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న విద్యార్థులు గత రెండు నెలలుగా అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల చర్యలతో అవమాన భారంతో తిరిగి వచ్చేస్తున్నారు. తాజాగా ఆదివారం 22మంది విద్యార్థులు శంషాబాద్ చేరుకున్నారు.

01/10/2016 - 05:57

హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌దే విజయం అని ఎంపి కవిత పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది. నిజామాబాద్ నాయకులతో ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.

01/10/2016 - 05:53

సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జనవరి 9: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో గురు, శుక్రవారాల్లో జరిగిన సంఘటలనకు బాధ్యులైన ఇరువర్గాలను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌పి సుమతి వెల్లడించారు.

01/10/2016 - 05:52

ఖమ్మం, జనవరి 9: ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 3,600 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండి జివి రమణారావు వెల్లడించారు. శనివారం ఖమ్మంలో నూతన బస్టాండ్ ఏర్పాటు కోసం ఎనె్నస్పీ స్థలాన్ని పరిశీలించిన అనంతరం తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం మేడారం జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు.

01/10/2016 - 05:24

హైదరాబాద్, జనవరి 9: మరో పదిహేను, ఇరవై ఏళ్లపాటు కెసిఆర్ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా ఉంటారని, తన స్థాయికి మంత్రి పదవే ఎక్కువ అని భావిస్తున్నానని, అంత కన్నా ఎక్కువ ఆశ పడడం లేదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కెటిఆర్ శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

01/10/2016 - 05:23

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించలేదని, పైగా ఎస్‌సి డివిజన్ల సంఖ్యను 12 నుంచి 10కి తగ్గించారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

01/10/2016 - 05:22

హైదరాబాద్, జనవరి 9: సంక్షేమ రంగంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మల్కాజిగిరి నియోజక వర్గం సమావేశం అల్వాల్‌లోని ఎమ్మెల్యే కనకారెడ్డి నివాసంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఈటల మాట్లాడుతూ పేదలు, సామాన్యుల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.

01/10/2016 - 04:00

హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకపాత్ర వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ జిల్లాతోపాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొంతభాగం కూడా ఉంది. ఈ మూడు జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులు. మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా 60మంది ప్రజా ప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది.

Pages