S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/07/2016 - 08:21

హైదరాబాద్, ఏప్రిల్ 6: కొడుకు పుట్టలేదని ఆడ శిశువులను కడతేరుస్తున్న నేటి సమాజంలో కూతురు పుట్టలేదని కొడుకును హత్య చేసింది ఓ తల్లి. నెల కూడా నిండని ముక్కుపచ్చలారని మగ శిశువును హత్య చేసి.. ఆ నేరం గొలుసు దొంగలపై నెట్టేందుకు యత్నించిన ఘటన నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

04/07/2016 - 08:02

హైదరాబాద్, ఏప్రిల్ 6: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన బహిరంగ విచారణ వాడివేడిగా జరిగింది. బుధవారం లక్డీకపూల్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో టిఎస్‌ఈఆర్‌సి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన బహిరంగ విచారణ నిర్వహించారు.

04/07/2016 - 07:59

హైదరాబాద్, ఏప్రిల్ 6: విశ్వవిద్యాలయాల ప్రమాణాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థల దుస్థితి తాజాగా కేంద్రం ప్రకటించిన యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో స్పష్టమైంది. తెలంగాణలో ఆరు సంప్రదాయ వర్శిటీలు, ఏడు స్పెషలైజ్డ్ యూనివర్శిటీలు, మూడు సెంట్రల్ యూనివర్శిటీలు, రెండు డీమ్డ్ వర్శిటీలు, రెండు జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి.

04/07/2016 - 05:10

హైదరాబాద్, ఏప్రిల్ 6: రాజధానిలోని బంజరాహిల్స్‌లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ జంట టవర్ల నిర్మాణంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ధర్మాసనం బెంచ్ ఎత్తివేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

04/07/2016 - 05:08

హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రజా వైద్యాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించడంతో ఇక నుంచి ప్రభుత్వ వైద్యశాలల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీంట్లో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 2400 పోస్టులను భర్తీ చేయాల్సిందిగా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

04/07/2016 - 05:06

ఎఫ్‌ఆర్‌బిఎం పెంపునకు కేంద్రం నిర్ణయం అదనంగా 2300 కోట్ల రుణానికి అవకాశం
14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు ఆమోదం ఫలించిన ముఖ్యమంత్రి కెసిఆర్ యత్నం

04/06/2016 - 18:00

వరంగల్: సంగెం మండలం కాపుల కనపర్తి వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ ఆటోను వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పదిమంది గాయపడ్డారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

04/06/2016 - 16:26

హైదరాబాద్: ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నంత మాత్రాన నిందితులపై చర్యలు తీసుకోవాలని తాము ఆదేశాలివ్వలేమని తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్‌సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి వీసీ అప్పారావును, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలను పదవుల నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

04/06/2016 - 16:26

హైదరాబాద్: నగరంలోని నేరేడ్‌మెట్ వద్ద మంగళవారం రాత్రి చైన్‌స్నాచర్ల దాడిలో పసికందు మరణించినట్లు వచ్చిన వార్తల్లో నిజానిజాలను పోలీసులు నిగ్గుతేల్చారు. కన్నతల్లే 25 రోజుల మగశిశువును కడతేర్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చైన్‌స్నాచర్లతో జరిగిన పెనుగులాటలో తలకు గాయమై మగశిశువు మరణించినట్లు తల్లి పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

04/06/2016 - 16:23

హైదరాబాద్: అన్నదమ్ముల ఘర్షణ ఫలితంగా మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నగరంలోని జీడిమెట్ల రంగారెడ్డినగర్‌లో జరిగింది. ఓ విషయంలో వివాదం ఫలితంగా ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడ్డారు. దీంతో కలత చెందిన అన్న భార్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Pages