S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/06/2016 - 16:21

హైదరాబాద్: ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు సుమారు 17 వేల మంది దరఖాస్తు చేసుకోగా 2532 మందికి మాత్రమే అవకాశం కల్పించారని, డిమాండ్ మేరకు హజ్ యాత్రకు కోటా పెంచాలని తెలంగాణ సిఎం కెసిఆర్ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు బుధవారం లేఖ రాశారు. తెలంగాణకు హజ్ కోటాను కనీసం నాలుగువేలకు పెంచాలని ఆయన కోరారు.

04/06/2016 - 14:11

హైదరాబాద్: బేగంపేటలోని తెలంగాణ సిఎం కెసిఆర్ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయు విద్యార్థులు మూకుమ్మడిగా క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. క్యాంప్ ఆఫీసులోనికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

04/06/2016 - 12:21

మెదక్: సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిల్‌కు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 28 వార్డు కౌన్సిలర్ల పదవులకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిల్‌లో 34 వార్డులుండగా, ఆరు వార్డుల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

04/06/2016 - 12:20

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సెక్షన్ ఆఫీసర్ జనార్దన్ మహేష్‌కు చెందిన ఇళ్లపై ఎసిబి అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు ప్రారంభించారు. ఇతనికి 8 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నగరంలో పలు చోట్ల 9 ఫ్లాట్‌లు, అయిదు చోట్ల ఇళ్లస్థలాలున్నట్లు కనుగొని, రెండున్నర లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

04/06/2016 - 12:19

హైదరాబాద్: బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లో ఇద్దరు మహిళలు మంగళవారం రాత్రి దుకాణానికి వెళ్లి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు అందింది. బిహెచ్‌ఇఎల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి తల్లి జిందమ్మ (55), అమ్మమ్మ హనుమంతి (70) అదృశ్యం కావడం సంచలనం కలిగించింది. రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

04/06/2016 - 12:18

ఆదిలాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, పంటల బీమా పథకాన్ని ప్రక్షాళన చేయాలని టి.జెఎసి చైర్మన్ కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కరవు అధ్యయన యాత్ర రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది.

04/06/2016 - 12:17

హైదరాబాద్: ఓ మహిళకు, చైన్‌స్నాచర్లకు మధ్య జరిగిన పెనుగులాట ఫలితంగా 25 రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నగరంలోని నేరేడ్‌మెట్‌లో మంగళవారం రాత్రి జరిగింది. అయితే, ఈ ఘటనపై విభిన్నకథనాలు వినిపిస్తున్నాయి. పెనుగులాటలో కత్తిగాయాలు తగలడం వల్ల శిశువు మృతిచెందినట్లు వార్తలు వ్యాపించాయి. అయితే, పెనుగులాటలో మహిళ చేతుల్లో నుంచి కింద పడడం వల్లే పసికందు గాయపడి మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు.

04/06/2016 - 12:16

హైదరాబాద్: ‘చలో హెచ్‌సియు’ పేరిట విద్యార్థి జెఎసి ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు జరిగే వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని విద్యార్థులు ఇదివరకే హెచ్చరించారు. వీసీ అప్పారావును వెంటనే పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తూ హెచ్‌సియు గేటు వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.

04/06/2016 - 08:48

హైదరాబాద్, ఏప్రిల్ 5: మిషన్ కాకతీయ మొదటి దశ పనులు ఈ నెల 30వ తేదీలోగా పూర్తి కావాలని, ఇకపై ఆలస్యాన్ని సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను హెచ్చరించారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనులు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారన్నారు.

04/06/2016 - 08:46

హైదరాబాద్, ఏప్రిల్ 5: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిస్థితులను చక్కదిద్దాలని, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావును తొలగించి ఆయనపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని, విద్యార్ధులపై బనాయించిన కేసులను తొలగించాలని కోరుతూ విద్యార్ధుల ఐక్య కార్యాచరణ కమిటీ బుధవారం నాడు చలో హెచ్‌సియు నిర్వహిస్తోంది.

Pages