S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/06/2016 - 05:42

హైదరాబాద్, ఏప్రిల్ 5: ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మధ్య ఏకీకృత సర్వీసు రూల్స్ ఉండాలనే డిమాండ్ పట్ల దశాబ్దన్నరగా నానుతున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడబోతుంది. ప్రభుత్వ, స్ధానిక సంస్థలకు చెందిన ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలను ఆమోదిస్తూ సిఎం కె చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. దీంతో విద్యాశాఖలో పదోన్నతులకు ఆటంకాలు తొలిగిపోయినట్టే.

04/06/2016 - 05:31

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణలో సిఎం సహాయ నిధి దారిమళ్లింది. వివిధ ఆసుపత్రులకు చెందిన నకిలీ బిల్లులతో 73 లక్షలు స్వాహా అయ్యాయి. 11,600 దరఖాస్తులను క్రైమ్ ఇనె్వస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) అధికారులు పరిశీలించారు. వీటిలో 112 మంది పేర్లతో నకిలీ బిల్లులు పెట్టి రూ. 73,68,572 లక్షలు కాజేసినట్టు అధికారులు తెలిపారు.

04/06/2016 - 05:28

హైదరాబాద్, ఏప్రిల్ 5: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ మహారాష్టల్ర మధ్య మరో వారంలో తుది ఒప్పదం జరగనుంది. హైదారాబాద్‌లో జరిగే ఒప్పందం కోసం మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకానున్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. నిర్దేశించిన కాలంలో ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాలకు సాగునీటిని అందించే కలను నిజం చేయనున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

04/06/2016 - 04:49

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఎత్తు పెంచేందుకు యువకుడి కాళ్లు కట్ చేసి రాడ్లు వేశారు గ్లోబర్ డాక్టర్లు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. హైట్ కోసం వైద్యులు చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందో.. లేదోనంటూ బెంగతో ఆసుపత్రి ఎదుట వాపోతున్నారు. కూకట్‌పల్లికి చెందిన గోవర్ధన్‌రెడ్డి కుమారుడు నిఖిల్ రెడ్డి (22) మూడు రోజుల క్రితం నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు.

04/05/2016 - 18:13

హైదరాబాద్: పరీక్షలు ముగిసిన అనంతరం ఆనందంగా గడుపుదామని వచ్చిన టెన్త్ విద్యార్థి నగరంలోని నెహ్రూ జూపార్క్‌లో మంగళవారం మృత్యువాత పడ్డాడు. పురానాపూల్‌కు చెందిన మంజిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూపార్క్‌కు వచ్చాడు. ఎత్తయిన ప్రాంతంలో నుంచి కిందకు నీరు పడుతున్న దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు ఈ విద్యార్థి ఓ బండరాయిపైకి ఎక్కి ఫొటోలు తీస్తూ కిందపడ్డాడు.

04/05/2016 - 17:30

హైదరాబాద్: ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు పట్టం కడుతూ తెలంగాణ పాలకులు అక్రమాలకు పాల్పడుతున్నారని , ఈ బండారాన్ని త్వరలోనే బయటపెడతానని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ముస్లిం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ సంతకాల ఉద్యమం చేపట్టగా తెరాస నేతల్లో వణుకు పుడుతోందన్నారు. మంత్రి కెటిఆర్ సరిగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు.

04/05/2016 - 15:01

హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టులపై ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు దీటుగా తాము కూడా ఓ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు టి.కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఉదయం కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన రెడ్డి తదిరులు సమావేశంమై ఈ విషయమై చర్చలు జరిపారు. ఈనెల 9న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరపాలని వారు నిర్ణయించినట్లు సమాచారం.

04/05/2016 - 14:59

హైదరాబాద్: తప్పుడు బిల్లులతో సిఎం సహాయనిధి నుంచి సుమారు 74 లక్షల రూపాయలను కాజేసిన కేసులో సిఐడి పోలీసులు సోమవారం అయిదుగురు బ్రోకర్లను అరెస్టు చేశారు. సిఎం సహాయ నిధి కోసం వచిచన 11,700 దరఖాస్తులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా 112 మంది పేరుతో భారీగా నిధులు స్వాహా చేసినట్లు తేలింది. ఈ కేసులో ఇదివరకే 10మందిని అరెస్టు చేయగా, మరో 20 మంది బ్రోకర్ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

04/05/2016 - 12:05

ఆదిలాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సోమవారం ఉదయం ముథోల్ మండలం బీద్రెల్లిలో రైతు కరవుయాత్రను ప్రారంభించారు. యాత్ర సందర్భంగా రైతులతో మాట్లాడి తెలంగాణలో కరవు పరిస్థితిపై అధ్యయనం చేస్తారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు పాల్గొని కరవు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.

04/05/2016 - 12:05

హైదరాబాద్: జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్ వద్ద ఆయన విగ్రహానికి సోమవారం ఉదయం సిఎం కెసిఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు మంత్రులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

Pages