S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/05/2016 - 12:07

హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 31 మంది నిందితులకు కోర్టు ట్రాఫిక్ డ్యూటీని శిక్షగా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు వీరంతా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఒక రోజంతా ట్రాఫిక్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది.

04/05/2016 - 12:04

హైదరాబాద్: పరిశుభ్రత పాటించనందున బంజారాహిల్స్ రోడ్ నెం 12లో హోటల్ ఓరీస్‌ను జిహెచ్‌ఎంసి అధికారులు సోమవారం ఉదయం సీజ్ చేశారు. కిచెన్‌లో అపరిశుభ్రత తాండవిస్తున్నట్లు స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్, శానిటేషన్ అధికారులు గుర్తించారు. దీంతో హోటల్‌ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

04/05/2016 - 06:26

హైదరాబాద్, ఏప్రిల్ 4: నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణలో తెలంగాణలో ఎల్‌ఇడి బల్బులు కాంతులు విరజిమ్మాయి. ఐటీ పాలసీ ఆవిష్కరణలో ఐటీతోపాటు ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జెయేష్ రంజన్ వివర్తి, తెలంగాణ గడ్డమీద తయారైన ఎల్‌ఇడి దీపాలు రాష్ట్ర చిత్రపటాన్ని ఆవిష్కరిస్తాయని ప్రకటించారు.

04/05/2016 - 06:26

హైదరాబాద్, ఏప్రిల్ 4: ఐటీ రంగంలో దేశంలోనే రెండవస్థానానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి దోహదపడే విధంగా ఐటీ పాలసీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. హెచ్‌ఐసిసిలోప్రకటించిన ఐటీతో సహా ఇతర నాలుగు అనుబంధ రంగాలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించింది. ఐటీ సంస్థలను స్థాపించడానికి వచ్చే సంస్థలకు అవసరమైన మేరకు భూమిని సమకూర్చనున్నట్టు పాలసీలో పేర్కొన్నారు.

04/05/2016 - 06:25

సంగారెడ్డి, ఏప్రిల్ 4: కొన్ని సంవత్సరాలుగా పాలకవర్గానికి నోచుకుండా ప్రత్యేక అధికారి పాలనలో మగ్గిన సిద్దిపేట పురపాలక సంఘానికి మరో వారం రోజుల్లో కొత్త పాలకవర్గం ఏర్పాటు కానుంది. ఈ నెల 6వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 34 వార్డులకుగాను 6 వార్డులు ఏకగ్రీవం కాగా 28 వార్డులకు ఎన్నికలు నిర్వహణ కొనసాగనుంది.

04/05/2016 - 06:24

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మాన్యుఫాక్చరింగ్, రూరల్ టెక్నాలజీ సెంటర్స్, గేమింగ్, యానిమేషన్ పాలసీలకు మంచి ఆదరణ లభించింది. పాలసీలు ప్రకటించిన తొలి రోజుననే 28 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు సమకూరడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనుంది.

04/05/2016 - 06:23

తొర్రూరు, ఏప్రిల్ 4: రానున్న కొద్దిరోజుల్లోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా సమూలంగా భూస్థాపితం చేస్తానని ఈ మేరకు టిఆర్‌ఎస్ నాయకత్వం ప్రత్యేక బాధ్యతలు అప్పగించిందని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

04/05/2016 - 06:22

హైదరాబాద్, ఏప్రిల్ 4: హైదరాబాద్ నగరంలో నియోజక వర్గాల వారిగా ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో వివరాలతో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నియోజక వర్గంలో అందుబాటులో ఉన్న భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, పాత ఇండ్ల ను తొలగించుకుని కొత్త ఇండ్లు కట్టుకోవడానికి సిద్ధపడే బస్తీలు ఎన్ని? తదితర అంశాలతో నివేదిక రూపొందించాలని సిఎం కోరారు.

04/05/2016 - 06:21

హైదరాబాద్, ఏప్రిల్ 4: ఈవ్ టీజ్‌కు పాల్పడే పోకిరీల ఆట కట్టిస్తామని, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జనవరి నుంచి మార్చి 31వరకు షీటీమ్స్ బృందం 138 కేసులు నమోదు చేసిందని షీటీమ్స్ అధికారిణి, అదనపు కమిషనర్ (క్రైమ్, సిట్) స్వాతిలక్రా తెలిపారు.

04/05/2016 - 06:20

వరంగల్, ఏప్రిల్ 4: దీర్ఘకాలికంగా ఉన్న రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించక పోతే దేశ వ్యాప్త సమ్మె చేపడతామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే జాతీ య ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయాస్ సంఘ్ డివిజనల్ కాన్ఫరెన్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

Pages