S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/29/2016 - 03:51

హైదరాబాద్, మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాపుష్కరాల నిర్వహణకు దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి శాసనసభ్యుడు బోడే ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

03/29/2016 - 02:45

హైదరాబాద్, మార్చి 28: అత్యంత కీలకమైన విద్య, వైద్యం కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లోకి వెళ్లిపోయాయని, వీటికి ప్రభుత్వ రంగంలో ప్రోత్సాహం కల్పించాలని వివిధ పార్టీల శాసన సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. విద్య, వైద్యం వంటి పలు అంశాల పద్దులపై సోమవారం శాసన సభలో చర్చ జరిగింది. ప్రధానంగా విద్య, వైద్యం వ్యాపారంగా మారిందని కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

03/29/2016 - 02:45

పెద్దపల్లి రూరల్, మార్చి 28: పెళ్లి వేడుక కోసం వచ్చి తిరిగి జీపులో వెళ్తుండగా, మూలమలుపు వద్ద జీపు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండల పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటనలో మరో 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

03/29/2016 - 02:44

తొగుట, మార్చి 28: మెదక్ జిల్లా తొగుట మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలో సోమవారం అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. ఓ పొలంలో ఈ వింత పక్షి కనబడడంతో గ్రామస్థులు ఆ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి వీరేందర్‌బాబు ఆధ్వర్యంలో బీట్ అధికారులు శ్రీనివాస్, హుస్సేన్ గ్రామానికి చేరుకుని దానిని పరీక్షించారు.

03/29/2016 - 02:43

హైదరాబాద్, మార్చి 28: రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో సోమవారం ఉదయం ఓ లారీ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అక్కా, చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మరో వైపు తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారుల తాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

03/29/2016 - 02:42

సిరిసిల్ల, మార్చి 28: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో పవర్‌లూం ఆసామి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్‌లో సమాచారం అందడంతో అధికార యంత్రాంగం హడలిపోయంది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లలోని బివై నగర్‌కు చెందిన పవర్‌లూం వస్త్ర ఉత్పిత్తిదారుడు మంత్రి రవీందర్ నష్టాలపాలై రూ.28 లక్షల మేరకు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.

03/29/2016 - 02:40

నల్లగొండ, మార్చి 28: తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అందరికీ దక్కేలా ప్రభుత్వ విధానాలు కొనసాగాలని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

03/29/2016 - 02:39

గజ్వేల్, మార్చి 28: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు వంటేను ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని రిమ్మనగూడ, కొడకండ్ల తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

03/29/2016 - 02:38

జగిత్యాల, మార్చి 28: కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ కేంద్రంగా సోమవారం నుండి ప్రారంభమైన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. పట్టణంలోని ఏడు కేంద్రాల్లో ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అందులో నాలుగ ప్రైవేట్ హైస్కూళ్లలో టెన్త్ కేంద్రాలు, మరో మూడు డిగ్రీ కళాశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేశారు.

03/29/2016 - 02:37

డిచ్‌పల్లి రూరల్, మార్చి 28: తాగిన మైకంలో ఓ కసాయి తండ్రి ముక్కుపచ్చలారని చిన్నారిని తన చేతులతోనే చిదిమేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నవీన్, ఇస్సపల్లి మమత దంపతులకు నాలుగు నెలల కుమారుడు రిషివర్ధన్ సంతానం. అయితే నవీన్ ప్రతిరోజు తప్పతాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు.

Pages