S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/28/2016 - 14:22

నిజామాబాద్: చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఓ హెడ్మాష్టర్ సుమారు పదికోట్ల రూపాయలను జనం నుంచి వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. కామారెడ్డిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగు చూసింది. ధర్మారావుపేటలో ప్రభుత్వ హెడ్మాష్టర్‌గా పనిచేస్తున్న బాలచంద్రం చాలాకాలంగా అధిక వడ్డీకి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ, ఇటీవల చిట్టీ పాటలను కూడా ప్రారంభించాడు.

03/28/2016 - 14:22

హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యంగా మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. మహిళల రక్షణ కోసం అన్ని జిల్లాల్లోనూ ఇక షీటీమ్‌లు పనిచేస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కొండా సురేఖ మహిళల భద్రత విషయమై ప్రశ్నించగా మంత్రి ఈమేరకు సమాధానం చెప్పారు.

03/28/2016 - 14:19

హైదరాబాద్: 1,900 కోట్ల రూపాయల హడ్కో నిధులను వెచ్చించి హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను తీర్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలంగాణ ఐటి, మున్సిపల్ మంత్రి కె.తారక రామారావు అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. హైదరాబాద్‌లో దాహార్తి తీర్చేందుకు కృష్ణా, గోదావరి నీటిని తరలిస్తున్నామని వివరించారు.

03/28/2016 - 12:30

నిజామాబాద్: మద్యం మత్తులో నాలుగు నెలల కుమారుడిని గొంతు నులిమి ఓ కన్నతండ్రి హతమార్చిన సంఘటన ఇది. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఈ దారుణం సోమవారం జరిగింది. ఈ విషయం తెలుసుకుని స్థానికులు ఆ తండ్రికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

03/28/2016 - 12:29

నల్గొండ: నల్గొండ జిల్లా పరిధిలో హెచ్‌పిసిఎల్ పైప్‌లైన్ నుంచి కొన్నాళ్లుగా పెట్రోల్‌ను దొంగిలిస్తున్న మహారాష్టక్రు చెందిన ఏడుగురు సభ్యులున్న ముఠాను బీబీనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

03/28/2016 - 12:28

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా వర్సిటీల్లో బంద్ పాటించాలని విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్ సహా పలుచోట్ల వర్సిటీలు మూతపడ్డాయి. హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావును అడ్డుకుంటామని విద్యార్థులు ప్రకటించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

03/28/2016 - 12:31

కరీంనగర్: రోడ్డుపక్క నేలబావిలో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు ప్రాణాలు కొల్పోయిన ఘటన కథలాపూర్‌లో సోమవారం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టంకు పంపారు.

03/28/2016 - 04:55

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా అన్ని గ్రామాలకు రోడ్డుసౌకర్యం కల్పిస్తూ బస్సులు నడుపుతామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అక్రమ రవాణాపై కొరడా ఝళిపిస్తామని, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

03/28/2016 - 04:53

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ జెఎసి ప్రజల గొంతుకగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం నగరంలో జరిగింది. ఇంతకాలం తమతో కలిసి పని చేసిన మిత్రుల అభిప్రాయాలను గౌరవిస్తామని, ఉద్యోగుల సమస్యలపై అవసరం అయితే వారికి అండగా నిలుస్తామని అన్నారు.

03/28/2016 - 04:52

హైదరాబాద్, మార్చి 27: రాష్ట్ర అసెంబ్లీ ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, రెవెన్యూ, పౌరసరఫరాలు, హోం, వ్యవసాయ, సహకార శాఖలకు సంబంధించిన పద్దుల (డిమాండ్ల)కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు కోత తీర్మానాలను సంబంధిత శాఖల మంత్రులు తోసిపుచ్చారు. ఆదివారం అసెంబ్లీలో ఈ శాఖల పద్దులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

Pages