S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/28/2016 - 01:14

హైదరాబాద్, మార్చి 27: పరిశ్రమల స్థాపన పేరిట ప్రభుత్వం నుంచి చూకగా భూములు తీసుకొని వినియోగించుకోకపోయినా, లేదా ఇతర అవసరాల కోసం వాటిని ఉపయోగించుకున్నా తిరిగి స్వాధీనం చేసుకుంటామని పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శాసనసభలో ఆదివారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.

03/27/2016 - 18:54

హైదరాబాద్ :టి-20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపటిలో జరగనున్న మ్యాచ్‌పై బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌లోని నాగోల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారినుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

03/27/2016 - 17:10

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారంనాడు భానుడు భగ్గుమన్నాడు. నిజామాబాద్‌లో 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే అత్యధికం. హనుమకొండలో 40.6, భద్రాచలంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

03/27/2016 - 17:09

హైదరాబాద్:కరీంనగర్ జిల్లా వీణవంకలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆరోపిస్తూ తెలంగాణ శాసనసభనుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. దళితులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం వీణవంక సంఘటనలో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అనుమానం వ్యక్తం చేసిన సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

03/27/2016 - 06:58

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఉస్మానియా యూనివర్శిటీలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై తెలంగాణ శాసనసభ శనివారం దద్దరిల్లింది. ఈ అంశంపై కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంతో విపక్షాలు వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశాయి.

03/27/2016 - 06:58

హైదరాబాద్, మార్చి 26: హెచ్‌సియు, ఒయూ వర్శిటీల అంశాలను చర్చకు అనుమతించాలని శాసనసభలో శనివారం ఎంఐఎం శాసససభాపక్ష నేత ఒవైసీ పట్టుబడుతుండగా మైక్ కట్ అయింది. దీంతో ఆగ్రహం చెందిన ఒవైసీ మైక్ కట్ చేసినా మాట్లాడసాగారు. తన స్ధానం నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ఆవేశంగా మాట్లాడారు. ఆ మాటలు ఏవీ రికార్డు కాలేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, ఒవైసీ గారూ ‘మీకేం కావాలో చెప్పండి.

03/27/2016 - 06:57

గజ్వేల్, మార్చి 26: తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న మెదక్ జిల్లా నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ్మస్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ రానివ్వొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

03/27/2016 - 06:56

హైదరాబాద్, మార్చి 26:వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 450 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేయాలని కోరు తూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఎపి విభజన చట్టం 2014లోని సెక్షన్ 94(ఎ) ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నాలుగు సంవత్సరాల కాలానికి 30,571 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కావాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు.

03/27/2016 - 06:56

నిజామాబాద్, మార్చి 26: ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధన కోసం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఆందోళన బాట పట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టిఎస్‌ఎఫ్‌యుటిఎ) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాలని నిర్ణయించారు.

03/27/2016 - 06:54

వేములవాడ, మార్చి 26: కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకళ్యాణం శనివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తంలో శనివారం ఉదయం 10.30 గంటలకు కళ్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు.

Pages