S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/26/2016 - 18:46

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు సభలో హెచ్‌సియు, ఉస్మానియా వర్సిటీల పరిస్థితిపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వేడిగా, వాడిగా చర్చ జరిగింది.

03/26/2016 - 17:14

హైదరాబాద్: హెచ్‌సియులో ఇటీవలి ఘటనలు తనను ఎంతగానో కలిచివేశాయని, ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైతే ప్రధాని మోదీతో, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో తాను మాట్లాడతానని సిఎం కెసిఆర్ శనివారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. హెచ్‌సియు వైస్ చాన్సలర్‌ను రీకాల్ చేయడం తమ పరిధిలో లేదని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

03/26/2016 - 17:12

హైదరాబాద్: వికారాబాద్‌లోని ఓ ఫాం హౌస్‌లో తన ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని టాలీవుడ్ హీరో నవదీప్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. విదేశీ మద్యం, అసభ్య నృత్యాలంటూ వార్తలు వచ్చాయని, నిజానికి గృహప్రవేశం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి విందు ఏర్పాటు చేశానని ఆయన వివరించారు. ఫాం హౌస్‌ను నిర్వహించే స్థాయి తనకు లేదన్నారు.

03/26/2016 - 17:12

హైదరాబాద్: హెచ్‌సియు, ఉస్మానియా వర్సిటీల్లో ఇటీవలి ఘటనలపై తెలంగాణ అసెంబ్లీలో వేడిగా, వాడిగా శనివారం చర్చ జరిగింది. ఈ అంశంపై చర్చ జరపాలని పలువురు సభ్యులు డిమాండ్ చేయడంతో సభ పలుసార్లు వాయిదా పడింది. వర్సిటీల్లో ఘటనలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. హోం శాఖ పద్దులపై చర్చించకుండా, హెచ్‌సియు ఘటనపై చర్చించాలని పట్టుబట్టడం సరికాదని ఆయన అన్నారు.

03/26/2016 - 12:22

హైదరాబాద్: మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం మళ్లీ ప్రారంభం కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసింది. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ ప్రారంభమైంది. పలు కీలక శాఖలకు సంబంధించి నిధుల కేటాయింపు, జమాఖర్చులపై సభ్యులు మాట్లాడుతున్నారు.

03/26/2016 - 12:21

నల్గొండ: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురై ఒకే కుటుంబంలో అయిదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటన భువనగిరిలోని హుస్సేనాబాద్‌లో శనివారం వెలుగుచూసింది. రమేష్ (40) అనే వ్యక్తి ఆర్థాక ఇబ్బందులతో సతమవుతూ సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని భావించాడు. రమేష్‌తో పాటు ముగ్గురు కుమార్తెలు, తల్లి (65) పురుగుల మందు తాగి మరణించారు.

03/26/2016 - 12:21

హైదరాబాద్: తెలుగు నటుడు నవ్‌దీప్‌కు చెందిన ఫాంహౌస్‌పై శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌లో నవ్‌దీప్‌కు చెందిన ఫాంహౌస్‌లో కొందరు ప్రముఖులు హాజరైన పార్టీలో డ్యాన్సర్లు అసభ్యనృత్యాలు చేస్తున్నారని, అనుమతులు లేకుండా విదేశీ మద్యం ఉంచారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు.

03/26/2016 - 12:20

హైదరాబాద్: ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లో ఆందోళనలు, దాడుల సంఘటనలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఆయన శనివారం టి.అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, వర్సిటీల్లో తాజా సంఘటనలు విచారకరమని, ఈ పరిణామాలను తాము ఖండిస్తున్నామన్నారు. ఓయులో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కారుపై దాడిని తాను గర్హిస్తున్నానని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

03/26/2016 - 04:00

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు మహర్దశ పట్టింది. రాష్ట్రంలోని 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించింది. పాత రికార్డులను భద్రపరచడం, సేవలను సత్వరమే అందించాలనే సంకల్పంతో డిజిటలైజేషన్‌కు రూ.

03/26/2016 - 02:27

నల్లగొండ, మార్చి 25: నల్లగొండ జిల్లాలో కరవు, ఎండల తీవ్రత, భూగర్భ జలమట్టం గణనీయ స్థాయిలో పడిపోవడం వంటి సమస్యల నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. రెండురోజులకు ఒకసారి చేసే నీటి విడుదల కాస్తా నాలుగైదు రోజులకు విడుదల చేస్తుండడంతో మున్సిపాల్టీలు, గ్రామాల్లో జనం తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నారు.

Pages