S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/05/2020 - 06:18

హైదరాబాద్, మార్చి 4: ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణను వెంటనే ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ డిమాండ్ చేశారు, లేకుంటే ఉద్యోగులతో కలిసి ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బీజేపీ రిటైర్డ్ ఎంప్లాయిస్, టీచర్సు సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

03/05/2020 - 06:16

హైదరాబాద్, మార్చి 4: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభం అవుతున్నాయి. తొలి రోజు సెకండ్ లాంగ్వేజి పేపర్ -2 జరగనుంది. సెకండియర్ పరీక్షలకు 4 లక్షల 88 వేల 323 మంది హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే పరీక్ష ప్రారంభం అవుతుందని, విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.

03/05/2020 - 06:14

హైదరాబాద్, మార్చి 4: ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి (80) బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. తిరుమలగిరి శ్మశాన వాటికలో ఆమె అంతిమ సంస్కారం నిర్వహించారు. సత్యవతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

03/05/2020 - 06:05

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని, వారి సేవలను కేసీఆర్ సర్కార్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ఉద్యోగులు సామాన్యప్రజలకు అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ఆయన అన్నారు.

03/05/2020 - 06:05

హైదరాబాద్, మార్చి 4: ‘సెట్విన్’ నేతృత్వంలో యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు కొత్తగా కొన్ని కోర్సులను ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ఇక్కడ విడుదల చేశారు.

03/05/2020 - 06:04

హైదరాబాద్, మార్చి 4:దేశంలో మతప్రాతిపదికన ప్రజలను, దేశాన్ని విడదీసి బీజేపీ రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని చూస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌కు సుదీర్ఘ ప్రజాస్వామిక దేశాధినేత వచ్చిన సమయంలో దేశ రాజదానిలో జరిగిన మతఘర్షణలు దేశ పరిస్థితిని తెలియచేస్తున్నాయన్నారు.

03/05/2020 - 06:03

హైదరాబాద్, మార్చి 4: బూటకపు వాగ్దానాలతో ప్రజలను కేసీఆర్ మోసం చేసి అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనందుకు నిరసనగా రేవంత్ రెడ్డి పట్నం గోస కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

03/05/2020 - 06:02

హైదరాబాద్, మార్చి 4: కేసీఆర్ సర్కార్‌కు పౌరసత్వసవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక పట్ల నిజంగా వ్యతిరేకత ఉంటే, ఈ నెల 6వ తేదీన గవర్నర్ ప్రసంగ పాఠంలో ఆ అంశాలను ప్రస్తావించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. టీపీసీసీ కోశాధికారి గూడూరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ఈ రెండు అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాలన్నారు.

03/05/2020 - 06:01

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణలో రాష్టస్థ్రాయిలో, జిల్లా స్థాయిలో ఈనెల 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ చైర్‌పర్సన్‌గా ఉండే ఈ కమిటీకి వైస్-చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కే.వీ. రమణాచారి ఉంటారు. సాంస్కతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మెంబర్-కన్వీనర్‌గా పనిచేస్తారు.

03/05/2020 - 01:29

హైదరాబాద్, మార్చి 4: శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ పాఠాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అందజేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందురోజు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ.

Pages