S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/27/2016 - 11:51

బోధన్: బోధన్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ వివిధ రాజకీయ పక్షాలు శనివారం బంద్ నిర్వహిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సి.ఎం. కెసిఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నేటితో 100 రోజులు పూర్తయిన సందర్భంగా అఖిలపక్ష బంద్ నిర్వహిస్తున్నారు.

02/27/2016 - 02:25

హైదరాబాద్, ఫిబ్రవరి 26: దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో లబ్దిదారుల మధ్య చిచ్చు మొదలైంది. బన్సీలాల్‌పేట డివిజన్‌లోని ఐడిఎల్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో 86 ఇళ్లను శుక్రవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు వచ్చారు.

02/27/2016 - 02:24

వరంగల్, ఫిబ్రవరి 26: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వ్యూహానికి టిడిపి, కాంగ్రెస్‌లు చెక్ పెట్టాయ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానే్న గ్రేటర్‌లో కూడా అనుసరించాలని టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించినా టిడిపి, కాంగ్రెస్ ముందుగానే పసిగట్టి చివరి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు.

02/27/2016 - 02:24

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 26: అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం 60 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్ తరపున 20 వార్డులకు 20 మంది అభ్యర్థులతో పాటు మరికొందరు రెబెల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. టిక్కెట్లు రాని పలువురు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు.

02/27/2016 - 02:23

వరంగల్, ఫిబ్రవరి 26: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 422 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 58 డివిజన్లకు గాను 811 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా శుక్రవారం 389 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. టిఆర్‌ఎస్, బిజెపి 58 డివిజన్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 49, టిడిపి 48 డివిజన్లతో సరిపెట్టుకుంది.

02/27/2016 - 02:23

బాసర, ఫిబ్రవరి 26: ప్రతి ఒక్కరికి ఇంటర్‌నెట్ వాడకంపై అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. శుక్రవారం బాసర గ్రామంలో డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ బాసర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

02/27/2016 - 02:22

ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 26: మూడు ముళ్ల సాక్షిగా ఒక్కటైన ఆ బంధం కడదాక తోడుగా నడిచింది. వారి జీవన‘యాత్ర’ గంటలోనే ముగిసి పోయింది. వివాహ ‘బంధం’ ఒకే చితికి చేరింది. వృద్ధ దంపతులు గండ్ర సత్తమ్మ (85) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం తెలిసిన గంటకే ఆమె భర్త గోవిందరావు (97) శ్వాస వదిలాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో శుక్రవారం తీవ్ర విషాదం నింపింది.

02/26/2016 - 17:02

హైదరాబాద్: తాను అదృశ్యమైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, డబ్బు కోసం తన తల్లి నాగేంద్రమ్మ వేధిస్తున్నందునే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సినీనటి స్వాతిరెడ్డి బంజరాహిల్స్ పోలీసులకు శుక్రవారం తెలిపింది. శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నాప్ చేయడంతో స్వాతి కనిపించకుండా పోయిందని ఆమె తల్లి ఇదివరకే పోలీసులను ఆశ్రయించారు.

02/26/2016 - 16:23

హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న బినామీ ఆస్తులన్నింటినీ తక్షణం జప్తు చేయాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఎపీ సిఐడి పోలీసులను అదేశించింది. ఆ సంస్థకు బినామీల పేరుతో 70 స్థిరాస్తులున్నట్లు తాజాగా గుర్తించామని సిఐడి అధికారులు నివేదించడంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆస్తులను జప్తు చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

02/26/2016 - 16:27

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో మంచినీటిని అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ఆయన శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపిన సందర్భంగా మిషన్ భగీరథ పనులపై ఆరా తీశారు. వేసవి ఎండలు ముదరక ముందే తాగునీటి అవస్థలు తీర్చేలా అధికారులు పనిచేయాలన్నారు.

Pages