S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/18/2016 - 11:54

మెదక్: పటాన్‌చెరులో జాతీయ రహదారి వద్ద దుకాణాల తొలగింపు వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. గురువారం ఉదయం జిహెచ్‌ఎంసి అధికారులు దుకాణాలు తొలగించే కార్యక్రమం చేపట్టగా, కార్పొరేటర్ శంకర్ యాదవ్ నాయకత్వంలో వ్యాపారులు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌ను నిలదీశారు.

02/18/2016 - 11:53

హైదరాబాద్: ముంబై జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి వస్తున్న గ్యాస్ ట్యాంకర్‌ను మదీనాగూడ వద్ద ఓ పెట్రోల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ట్యాంకర్లలో గ్యాస్, పెట్రోల్ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. రెండు వాహనాల డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

02/18/2016 - 11:49

హైదరాబాద్: నగర శివారులో హయత్‌నగర్ మండలం లక్ష్మారెడ్డిపాలెం వద్ద గురువారం ఉదయం మలుపు తిరుగుతున్న లారీని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు 10 మంది విద్యార్థులకు గాయాలు తగిలాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

02/18/2016 - 11:49

వరంగల్: మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో గురువారం సమ్మక్క, సారలమ్మల దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. బుధవారం సారలమ్మను గద్దెపైకి తీసుకురాగా, నేడు సమ్మక్కను తీసుకువస్తున్నారు. క్యూలైన్లన్నీ నిండిపోవడంతో భక్తులు సులభంగా దర్శనం చేసుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు రాత్రి 7 గంటల సమయానికి గద్దెపైకి సమ్మక్క రానుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

02/18/2016 - 07:31

మేడారం: అశేష భక్తజనావళి ఎదురుచూసే అపురూప క్షణాలు మరికొన్ని గంటల్లో సమీపించనున్నాయి. కోటిమంది భక్తులు విడిది చేసి తమ ఇష్టదైవాలైన సమ్మక్క- సారలమ్మ తల్లుల రాకకోసం ఎదురుచూస్తుండగా సారలమ్మ గద్దెనెక్కిన వేళ.. సమ్మక్క తల్లి రాకకోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూసే ఉద్విగ్న క్షణాలు గురువారం ఫలించనున్నాయి.

02/18/2016 - 07:30

దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండ ల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విగ్రహాన్ని తెరాస మండల అధికార ప్రతినిధి గుండా రవీందర్ కెసిఆర్ జన్మదిన సందర్భంగా బుధవారం తన ఇంటి వద్ద ఆవిష్కరించారు. తెరాసకు వీరాభిమాని అయిన రవీందర్ గతంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి విగ్రహాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు.

02/18/2016 - 07:08

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలకు గౌరవార్హత లేదని సుప్రీంకోర్టు తరపు న్యాయవాది రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్‌లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణకు చేపట్టింది.

02/18/2016 - 07:06

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 1000 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంతో పాటు 1064 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కె తారకరామారావు అధికారులను ఆదేశించారు.

02/18/2016 - 07:05

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 62వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు.

02/18/2016 - 06:12

రాత్రి 9:59కు
గద్దెనెక్కిన సారలమ్మ

దారి పొడవునా వరంపట్టిన భక్తులు
పెద్దఎత్తున కొనసాగుతున్న మొక్కులు
మూడంచెలుగా పోలీసుల భారీ బందోబస్తు
అపురూప ఘట్టంగా నేడు గద్దె చేరనున్న సమ్మక్క

Pages