S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/16/2016 - 13:26

ములుగు: వరంగల్‌ జిల్లా ములుగు మండలం జాకారం గ్రామ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హన్మకొండ నుంచి ములుగు వస్తున్న ద్విచక్రవాహనం జాకారం సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

01/15/2016 - 07:33

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణకు గానీ, హైదరాబాద్‌కు గానీ ప్రధాని మోదీ ఒరగబెట్టింది ఏమిలేదనీ, అలాంటప్పుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావుప్రశ్నించారు. తెలంగాణ సంగతి అటుంచి కనీసం హైదరాబాద్ నగరానికి మోదీ ఏం చేశారో చెప్పాలని బిజెపి నేతలను మంత్రి నిలదీశారు.

01/15/2016 - 07:32

హైదరాబాద్, జనవరి 14: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 150 డివిజన్లు..7757 పోలింగ్ కేంద్రాలు..74 లక్షల పై చిలుకు ఓటర్లు. వీటిలో మన ఓటు ఎక్కడుందో, ఇపుడు వెతుక్కుని ఓటు వేయాలా? అన్న బెంగ అవసరం లేదు. ఎవరి ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో, పోలింగ్ బూత్ నెంబరు, ప్రాంతంతో పాటు పూర్తి ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునేందుకు వీలుగా మహానగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక యాప్‌కు రూపకల్పన చేశారు.

01/15/2016 - 07:29

హైదరాబాద్, జనవరి 14: మినీ కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్ధుల ఖరారులో టిడిపి-బిజెపి కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదరక తంటాలు పడుతోంది. ఇక వైకాపా బరిలోకి దిగకముందే తప్పుకుంది. ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టిడిపి శ్రేణుల్లో కదనోత్సాహం కరవైతే, వైకాపా శ్రేణులు పార్టీ ప్రకటనతో నిరాశలో పడిపోయాయి.

01/15/2016 - 07:35

చౌటుప్పల్, జనవరి 14: పల్లె‘టూర్’ ప్రశాంతంగా సాగింది. హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారికి సంక్రాంతి తాకిడి పెరిగింది. సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు రాజధాని నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వాహనాలలో తరలివెళ్లడంతో హైవే కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 17 వేల వాహనాలు వెళ్తుండగా పండుగ సందర్భంగా రెట్టింపయ్యాయి. అడుగడుగునా ట్రాఫిక్ స్తంభించింది.

01/15/2016 - 07:23

సూర్యాపేట, జనవరి 14: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులు ఖాళీగా తిరిగి వెళ్తున్నాయి. పండుగను తమతమ స్వస్థలాల్లో జరుపుకునేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యంకోసం హైదరాబాద్ నుంచి వందల సంఖ్యలో బస్సులను విజయవాడ, రాజమండ్రి, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు నడిపారు.

01/15/2016 - 07:08

హైదరాబాద్, జనవరి 14: జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో వేడి పెరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరుగా రంగంలో దిగి టిఆర్‌ఎస్‌పై ముప్పేట దాడిని ముమ్మరం చేశారు. గురువారం కేంద్ర మాజీ మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, రేణుకా చౌదరి వేరు వేరుగా మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నమ్మవద్దని, కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు.

01/15/2016 - 07:19

హైదరాబాద్, జనవరి 14: అంతర్జాతీయ పంతగుల పోటీకి ఈసారి హైదరాబాద్ వేదికైంది. గురువారం ఆగాఖాన్ అకాడమీలో పర్యాటక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ పోటీలను ప్రారంభించారు. అంతర్జాతీయ పతంగుల పోటీలను తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. గతంలో ఈ పోటీలను గుజరాత్‌లో మాత్రమే నిర్వహించే వారని, హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి అని మంత్రి అన్నారు.

01/15/2016 - 06:45

హైదరాబాద్, జనవరి 14:జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అధికార తెరాస తొలి జాబితాపై కసరత్తు మొదలు పెట్టింది. ఎవరికి టికెట్ దక్కుతుంది..ముఖ్యంగా తొలి జాబితాలో ఎవరికి చోటు లభిస్తుందన్న ఉత్కంఠ నేపథ్యంలో పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

01/14/2016 - 11:51

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు టిఆర్‌ఎస్ నేతలు తమ వ్యూహానికి పదును పెడుతున్నారు. గురువారం ఉదయం టిఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీ ప్రచార వ్యూహంపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు కసరత్తు పూర్తి కావస్తోంది. సమావేశంలో కడియం శ్రీహరి, కెటిఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Pages