S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/14/2016 - 07:52

హైదరాబాద్, జనవరి 13: కుటుంబ రాజకీయాలు కేవలం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకే పరిమితం కాదు. మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ నాయకుల కుటుంబ సభ్యులు టిక్కెట్ల కోసం పోటీలు పడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ 17వ తేదీతో ముగుస్తుంది. జిహెచ్‌ఎంసిలో 50 శాతం డివిజన్లు మహిళలకు రిజర్వు కావడంతో ఇంతకాలం పోటీ చేస్తామనుకున్న మగవాళ్లు నిరాశకు లోనయ్యారు.

01/14/2016 - 07:51

యాదగిరిగుట్ట రూరల్, జనవరి 13: దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కార్యదీక్ష గొప్పదని, దేశంలోనే మరే ముఖ్యమంత్రి ఒక దేవాలయానికి సంవత్సరానికి 100 కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత లేదని, అలాంటి ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఈ క్షేత్రం ధర్మం, ఆధ్యాత్మికం, సంస్కృతితో వర్ధిల్లుతుందని కమలానంద భారతీస్వామి అన్నారు.

01/14/2016 - 07:50

హైదరాబాద్, జనవరి 13: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో తెరాస, తెదేపా, బిజెపిల కార్పొరేషన్ సీట్ల అమ్మకం జోరుగా సాగుతోందని లోక్‌సత్తా గ్రేటర్ విభాగం ఆరోపించింది. బుధవారం లోక్‌సత్తా గ్రేటర్ విభాగం ప్రధాన కార్యదర్శి సాంబిరెడ్డి, సహకార్యదర్శి లావణ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెరాస ఒక్కో సీటును రూ. కోటికి, తెదేపా, బిజెపిలు రూ. 50 లక్షలకు అమ్ముతున్నాయని ఆరోపించారు.

01/14/2016 - 07:48

హైదరాబాద్, జనవరి 13: పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజాను నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫైలుపై అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న సంతకం చేశారు. దీంతో అటవీ, పర్యవరణ శాఖల కార్యదర్శి వికాస్‌రాజ్ బుధవారం జివో నంబర్ 2 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

01/14/2016 - 06:30

హైదరాబాద్, జనవరి 13: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ ఆంధ్రప్రదేశ్ సిఎం ఎన్ చంద్రబాబునాయుడిని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. వరంగల్ జిల్లాలోని బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్)కు సబ్సిడీపై యూకలిప్టస్ కలప అందజేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మూతపడిన బిల్ట్‌ను తిరిగి తెరిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

01/13/2016 - 12:06

హైదరాబాద్: చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నించి విద్యుత్ షాక్‌కు గురై తొమ్మిదేళ్ల బాలుడు మరణించిన సంఘటన రామంతాపూర్ వద్ద జరిగింది. సంక్రాంతి సెలవులు కావటంతో సూర్య రవికుమార్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం గాలిపటాలు ఎగురవేస్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డ రవికుమార్ చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి మరణించాడు.

01/13/2016 - 12:05

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి, బిజెపి నేతలు బుధవారం ఉదయం ఎ.పి. సి.ఎం. చంద్రబాబు సమక్షంలో చర్చలు జరిపారు. టిడిపి నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

01/13/2016 - 12:04

కరీంనగర్: బోయిన్‌పల్లి మండలం వరదవెల్లి వద్ద బుధవారం ఉదయం ఆటో బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘటనలో గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

01/13/2016 - 12:02

హైదరాబాద్: వికారాబాద్‌లోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో బుధవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దుకాణంలో సుమారు 15 లక్షల రూపాయల విలువచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి.

01/13/2016 - 08:28

సూర్యాపేట, జనవరి 12: ఆదాయమే లక్ష్యంగా..నష్టాల నుండి గట్టెక్కడమే ధ్యేయంగా టిఎస్‌ఆర్టీసి కొత్త మార్గాలను అనే్వషిస్తోంది. సంస్థ పరిధిలోని స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని యోచిస్తోంది.

Pages