S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/23/2015 - 07:23

ఆదిలాబాద్,డిసెంబర్ 22: గోదావరి బేసిన్‌పై రిడిజైనింగ్ మార్పులతో ప్రాణహిత వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజి నిర్మాణాలకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. కౌటా ల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ని ర్మించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తిపోతలకు 148 మీటర్ల అడుగుల ఎత్తువరకే అనుమతిస్తామని ముందునుండి పట్టుబడుతూ వచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం తమ పంతం నెగ్గించుకుంది.

12/23/2015 - 07:22

జగదేవ్‌పూర్, డిసెంబర్ 22: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రం సంపూర్ణమైన ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో నేటి నుంచి 27 వరకు నిర్వహించే అయుత చండీ మహాయాగం పనులు పూర్తి కాగా, 106 హోమగుండాలను విఐపిలతో పాటు అన్ని వర్గాల ప్రజలు దర్శించుకునే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

12/23/2015 - 07:18

ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ ప్రభు త్వం తీసుకున్న బీసీ క్రిమీలేయర్ అమలు నిర్ణయాన్ని రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీసీలను విభజించి పాలించేందుకు కొత్త విధానాలను తీసుకొస్తోందని, 6లక్షల ఆదాయం ఉన్న బీసీలకు రిజర్వేషన్ వర్తించదంటే ఎలా అని ప్రశ్నించారు.

12/23/2015 - 07:17

మహబూబాబాద్, డిసెంబర్ 22: విద్యారంగాన్ని అత్యంత పటిష్టం చేయాలనే ఆలోచనతో రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అన్నారు. వరంగల్ జిల్లా మానుకోట మండలంలోని రెడ్యాల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుండి వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

12/23/2015 - 07:17

హైదరాబాద్, డిసెంబర్ 22: లండన్ నుండి వచ్చిన మూడు సంవత్సరాల చిన్నారికి హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌లో విజయవంతంగా అలర్జీ పరీక్షలు నిర్వహించారు. చిన్నారి ధృవ్ అనే బాలుడు పుట్టుకతోనే వివిధ రకాలైన అలర్జీలతో సతమతమవుతుండగా, లండన్ వైద్యులు అనేకరకాలైన చికిత్స విధానాలను అవలంబించి చూశారు. ఎన్ని మందులు వాడినా ధృవ్‌కు అలర్జీ తగ్గలేదు.

12/23/2015 - 07:15

భద్రాచలం, డిసెంబర్ 22: ఈ ఏడాది గోదావరి పుష్కరాలు ఎంతో వైభవంగా జరిగాయి. జూలై నెలలో తెలంగాణ రాష్ట్రం గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు ఆయా క్షేత్రాలకు నిధులు కూడా ఇస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించింది. ఖమ్మం జిల్లాకు రూ.1.50కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటన కూడా జారీ చేశారు. అంతవరకు బాగానే ఉంది. జిల్లా యంత్రాంగం హడావుడిగా పనులు చేపట్టింది.

12/23/2015 - 06:58

భద్రాచలం, డిసెంబర్ 22: ఈ ఏడాది గోదావరి పుష్కరాలు ఎంతో వైభవంగా జరిగాయి. జూలై నెలలో తెలంగాణ రాష్ట్రం గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు ఆయా క్షేత్రాలకు నిధులు కూడా ఇస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించింది. ఖమ్మం జిల్లాకు రూ.1.50కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటన కూడా జారీ చేశారు. అంతవరకు బాగానే ఉంది. జిల్లా యంత్రాంగం హడావుడిగా పనులు చేపట్టింది.

12/23/2015 - 06:45

హైదరాబాద్, డిసెంబర్ 22: నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (మెకానికల్) పోస్టుల నియామకానికి ఈ నెల 30వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు.

12/23/2015 - 06:43

హైదరాబాద్, డిసెంబర్ 22: టిఎస్ ఐపాస్ కింద 14 పరిశ్రమలకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం అనుమతి పత్రాలు అందజేశారు. 14 పరిశ్రమలు 1118.62 కోట్ల రూపాయల పెట్టుబడితో 7079 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు స్థాపించనున్నారు. మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిశ్రమలు స్థాపించనున్నారు.

12/23/2015 - 06:42

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 22: ఐదు రాష్ట్రాల్లో బ్యాంకు దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన గజ దొంగ బాల మురుగన్ ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. ముఠాలోని మరో ఇద్దరు దినచరణ్, సురేష్ పరారీలో ఉన్నారు. బ్యాంకులను దోచుకుంటూ సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు బాలమురుగన్ నుంచి రూ.

Pages