S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/09/2016 - 12:01

కరీంనగర్: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ ఇక్కడి హెలిపాడ్ పార్క్‌లోని నవగ్రహాల గుడిని శుక్రవారం అర్ధరాత్రి అధికారులు కూల్చివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కూల్చివేతకు నిరసనగా స్థానికులు, ప్రజా ప్రతినిధులు శనివారం ఉదయం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే నవగ్రహాల గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ నిర్వహించటంతో స్థానికులు శాంతించారు.

01/09/2016 - 07:41

హైదరాబాద్, జనవరి 8: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి మార్కులు తక్కువ వచ్చాయని కలతచెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆకస్మిక మృతితో హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..

01/09/2016 - 07:40

హైదరాబాద్, జనవరి 8: ‘సెటిలర్లు జర జాగ్రత్త...మోసగాళ్ళు మీ వద్దకు వస్తున్నారు..’ అని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లను ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రేమ ఒలకబోస్తున్నదని ఆయన శుక్రవారం కోదండరెడ్డితో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు.

01/09/2016 - 07:39

హైదరాబాద్, జనవరి 8: ఒకవైపు 18నెలల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణపై చూపుతున్న వివక్షనే ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాలని టిఆర్‌ఎస్ నిర్ణయించింది. గ్రేటర్ ఎన్నికల ప్రచార వ్యూహాంపై నిర్ణయం తీసుకున్నారు. 18నెలల టిఆర్‌ఎస్ పాలనా కాలంలో సాధించిన అభివృద్ధిపై గణాంకాలతో నివేదిక రూపొందించారు.

01/09/2016 - 07:38

హైదరాబాద్, జనవరి 8: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తట్టియన్నారం గ్రామంలో సర్వే నెం.108 నుంచి 111 వరకు ఉన్న భూమిలో కొంత భూమిని నకిలీ భూమి పాస్‌పుస్తకాలతో అమ్మివేసిన కేసులో ఇద్దరు సోదరులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం డిటెక్టివ్ విభాగం జాయింట్ కమిషనర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కె.కరుణకర్‌రెడ్డి, కె.నర్వోత్తమ్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

01/09/2016 - 07:37

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వివిధ మోసాలకు పాల్పడుతున్న పది మంది అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను హైదరాబాద్ నగర సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.90 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్స్, బంగారు రంగు పూతపూసిన చైన్లు, 5 నిజమైన బంగారు ఆభరణాల ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు.

01/09/2016 - 07:35

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ జిల్లాలన్నీ హైదరాబాద్‌లోనే మకాం వేసినట్టుగా మంత్రులంతా హైదరాబాద్‌ను చుట్టు ముట్టారు. గ్రేటర్ ఎన్నికల కోసం మంత్రులు తమకు కేటాయించిన నియోజక వర్గాల్లో బాధ్యతలు చేపట్టారు. నగరానికి చెందిన మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పద్మారావులతో పాటు మిగిలిన మంత్రులంతా నగరంలోనే మకాం వేసి కార్యకర్తలతో సమావేశాలు, కాలనీల్లో సభలు నిర్వహిస్తున్నారు.

01/09/2016 - 07:15

దుబ్బాక, జనవరి 8: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తాను చిన్ననాడు చదువుకున్న బడికి మహర్దశ వచ్చింది. మెదక్ జిల్లా దుబ్బాక బాలుర ఉన్నత పాఠశాలలో కెసిఆర్ 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదివారు. తాను ఆడిపాడి చదవుకున్న బడి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని వానపడితే విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్న విషయం ఎమ్మెల్యే రామలింగారెడ్డి ద్వారా కెసిఆర్ తెలుసుకున్నారు.

01/09/2016 - 07:10

సిద్దిపేట, జనవరి 8 : ఒక బీడీ కంపెనీలో మునీంగా పనిచేస్తున్న యువకుడిని సర్పంచ్ కుమారులు కొట్టి చంపారని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు మూకు మ్మడిగా దాడి చేసి సర్పంచ్ ఇంటిని తగులబెట్టారు. అడ్డుకోబో యన పోలీసులపై రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే...

01/09/2016 - 07:09

వరంగల్, జనవరి 8: వరంగల్ ఎంజిఎం నర్సింగ్ విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ అయింది. నర్సింగ్ హాస్టల్‌లో 243మంది విద్యార్ధినిలు ఉండగా అందులో దాదాపు 30మందికి పైగా విద్యార్ధినిలు తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న 12మంది విద్యార్ధినిలకు ఎఎమ్‌సి వార్డులలో చికిత్స అందిస్తున్నారు.

Pages