S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/09/2016 - 07:09

హైదరాబాద్, జనవరి 8: తెలుగు మీడియాలో ఎక్కడా లేనంత చైతన్యం ఉందని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెన్నారు. ఇటీవల తాను ఉత్తరప్రదేశ్ వెళ్లి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరిపాక ఇద్దరం మీడియాతో మాట్లాడేందుకు వచ్చామని చెప్పారు.

01/09/2016 - 07:08

బోయినిపల్లి, జనవరి 8: కరీంనగర్ జిల్లా బోయనిపల్లి మండల పరిధి లోని మధ్యమానేరు నిర్వాసితులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి రూ.5.04 లక్షలు చెల్లిస్తారా? లేదా ముఖ్యమంత్రితో తాము మాట్లాడడానికి అపాయింట్‌మెంటు ఇప్పిస్తారా? అంటూ నిర్వాసితులు రోడ్డెక్కారు.

01/09/2016 - 07:08

రామగుండం, జనవరి 8: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సదర్ హోం నుండి పరారైపోతున్న ఇద్దరు యువతులను రామగుండం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రైలుకోసం ఎదురు చూస్తున్న ఆ యువతులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి వారిని తీసుకున్నారు. బెంగాల్‌కు చెందిన రాధాలాహోర్, ఒడిషాకు చెందిన గీతాంజలి నాయక్ రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఇద్దరినీ విచారించగా అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూశాయి.

01/09/2016 - 07:07

మహబూబ్‌నగర్, జనవరి 8: హైదరాబాద్ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కెసిఆర్‌కు ఎక్కడిదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫక్తు రాజకీయాలు చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

01/09/2016 - 07:07

హైదరాబాద్, జనవరి 8: మిషన్ కాకతీయ పనుల్లో అటవీ శాఖ అనుమతుల విషయంలో మహబూబ్‌నగర్ జిల్లా అధికారుల పనితీరు బాగుందని మిగిలిన జిల్లాల అధికారులు వారిని అనుసరించాలని పంచాయితీరాజ్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. అటవీ శాఖ నుంచి అనుమతులు పొందేందుకు అనుసరించాల్సిన పద్దతుల గురించి చర్చించారు.

01/09/2016 - 06:37

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణలో అన్నిస్థాయిల్లో ఉచిత విద్య అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రూపొందించిన డైరీ, క్యాలండర్‌ను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వేసవిలో జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల అంశాన్ని పరిష్కరిస్తామన్నారు.

01/09/2016 - 06:36

హైదరాబాద్, జనవరి 8:పాలమూరు జిల్లాలో ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నింటి నుంచి జూలై నాటికి సాగునీటిని విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల్లో భూ సేకరణ సమస్యలపై హరీశ్‌రావు శుక్రవారం సమీక్ష జరిపారు.

01/09/2016 - 03:36

పెద్దపల్లి, జనవరి 8: గడువు ముగియకుండానే బదిలీ చేయడంపై మనస్థాపానికి గురైన పెద్దపల్లి ఎస్‌ఐ జగన్‌మోహన్ శుక్రవారం రాత్రి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. 2007 బ్యాచ్‌కు చెందిన జగన్‌మోహన్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలో పనిచేసి ఏడాది క్రితం పెద్దపల్లి ఎస్‌ఐగా బదిలీపై వచ్చాడు.

01/09/2016 - 03:34

హైదరాబాద్, జనవరి 8: నిర్మాణ రంగం ప్రోత్సాహకంగా చాలావరకూ నిబంధనలు సరళీకృతం చేశామని, బిల్డర్లు సద్వినియోగం చేసుకోవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. వెసులుబాటును దుర్వినియోగపర్చి అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అవసరమైతే బ్లాక్‌లిస్టులో పెట్టేందుకూ వెనుకాడేదిలేదన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం 27వ అఖిల భారత బిల్డర్ల అసోసియేషన్ సదస్సును కెసిఆర్ ప్రారంభించారు.

01/09/2016 - 03:30

హైదరాబాద్, జనవరి 8: జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ఎన్నికల సంఘం కమిషనర్ వి నాగిరెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచే నియమావళి అమల్లోకి వస్తుందని, శనివారం నుంచి అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు.

Pages