S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/08/2016 - 06:29

హైదరాబాద్, జనవరి 7: ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జూనియర్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుండి ఉచిత విద్యను అమలుచేయాలని నిర్ణయించింది. ఎల్‌కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్యను అందిస్తామనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ విద్యారంగంలో తొలి మెట్టుగా ప్రభుత్వం ఇంటర్మీడియట్ కాలేజీల్లో అందరికీ ఉచితంగా విద్యను అందించాలని నిర్ణయించింది.

01/08/2016 - 05:53

హైదరాబాద్, జనవరి 7: హైకోర్టు తీర్పును గౌరవించి కోర్టు చేసిన సూచనమేరకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని సిఎం కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించారు. ఈమేరకు సిఎం పేరిట ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

01/08/2016 - 05:53

హైదరాబాద్, జనవరి 7: జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సర్కారు దూకుడుకు కోర్టు బ్రేక్‌వేసింది. నేటికీ డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేయకపోవటం, రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలకు కనీసం 45 రోజుల గడువివ్వాలంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది.

01/08/2016 - 05:48

సంగారెడ్డి, జనవరి 7: వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో వందేళ్ల క్రితంనాటి సాగు వైభవాన్ని తెచ్చే కృతనిశ్చయంతో ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమికి సాగు నీరు అందించాలని ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు.

01/08/2016 - 05:45

హైదరాబాద్, జనవరి 7: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల పంట రుణాలను మాఫీ చేసినప్పటికీ బ్యాంకులు సరిగా వ్యవహరించక పోవడం వల్లే ప్రభుత్వానికి ఆశించిన విధంగా పేరు రాలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణ మాఫీపట్ల బ్యాంకులు వ్యవహరించిన తీరువల్ల రైతుల నుంచి తమ ప్రభుత్వం నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.

01/07/2016 - 15:24

వరంగల్‌ : నాణ్యమైన మందులను ఉత్పత్తి చేయని 63 కంపెనీల లైసెన్సులను రద్దు చేసినట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణశాఖ సంచాలకుడు అకున్‌సబర్వాల్‌ అన్నారు. గురువారం వరంగల్‌కు వచ్చిన ఆయన హన్మకొండలోని రెడ్‌క్రాస్‌ రక్తనిధి బ్యాంకును పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 139 బ్లడ్‌ బ్యాంకులు ఉండగా నిబంధనలు పాటించని 110 బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్లు చెప్పారు.

01/07/2016 - 14:11

మెదక్: సీఎం కేసీఆర్ జిల్లాలోని ములుగులో ఏర్పాటు చేయనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్, అటవీ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేశారు.

01/07/2016 - 12:11

నల్గొండ: లారీ యజమాని నిద్రిస్తుండగా గొంతు కోసి హతమార్చి క్లీనర్ నగదుతో పరారయిన సంఘటన గురువారం ఈదులగూడెంలో జరిగింది. యజమాని సాయిబాబా లారీలో నిద్రిస్తుండగా క్లీనర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతుడు సాయిబాబా జగ్గయ్యపేట మండలానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.

01/07/2016 - 12:09

ఖమ్మం: అశ్వారావుపేటలోని మూర్తిరాజు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు చొరబడి కిలో వెండి, బంగారం, లక్షన్నర విలువచేసే పట్టుచీరలను దోచుకుపోయారు. తెల్లవారుజామున మూర్తిరాజు లేచి చూడగా తలుపులు బార్లా తీసి ఉన్నాయి. దీంతో చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

01/07/2016 - 12:08

కరీంనగర్: కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి మృతి చెందిన సంఘటన జమ్మికుంట మండలం ఇల్లంతకుంటలో గురువారం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే తట్టుకోలేక తల్లి నాగమ్మ (70) భోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Pages