S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/07/2016 - 07:25

హైదరాబాద్, జనవరి 6: మహానగర పాలక సంస్థ ఎన్నికల క్షేత్ర స్థాయి ప్రక్రియను కేవలం పదిహేనురోజులకు కుదిస్తూ చట్టసవరణ చేసిన ప్రభుత్వం తాజాగా మరో సవరణకు శ్రీకారం చుట్టింది. పోటీ చేసే అభ్యర్థి తమ నామినేషన్ పత్రంలో పోటీ చేయాలనుకున్న డివిజన్ క్రమ సంఖ్య, పేరు తప్పకుండా పొందుపర్చాలని సర్కారు పేర్కొంది.

01/07/2016 - 07:25

రామగుండం, జనవరి 6: అది కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని బ్రాహ్మణపల్లి, కొత్తపల్లి గ్రామాలు మానవాళికి ప్రాణాంతకమైన క్యాట్‌ఫిష్ చేపల పెంపకానికి కేంద్రంగా మారాయ...బ్రాహ్మణపల్లి, గ్రామ శివారులోని దట్టమైన అటవీ ప్రాంతం... అంగబలమున్న నేతల అండదండలతో ఏడాదికాలంగా కొనసాగుతోంది ఈ అక్రమ వ్యవహారం సర్పంచ్ భర్త భూమిలోనే క్యాట్‌ఫిష్ పెంపకం దందా...

01/07/2016 - 07:06

వరంగల్, జనవరి 6: గుడుంబాపై ఆధారపడి బ్రతుకుతున్న వారు ప్రస్తుతం వాటిని విడనాడి గౌరవప్రద జీవితం గడుపుతున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు జిల్లాకు ఐదు కోట్ల రూపాయలను మంజూరి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుడుంబా నిర్మూలనపై స్వయంసంఘాలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు.

01/07/2016 - 07:04

సిద్దిపేట, జనవరి 6: పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేట శక్తిగార్డెన్‌లో బుధవారం పోలీసు శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న సిద్దిపేట ఉద్యోగ సాధనలో ముందుండాలనే ఉచితంగా పోలీసు శిక్షణను నిర్వహించినట్లు తెలిపారు.

01/07/2016 - 07:03

వరంగల్, జనవరి 6: ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలకు కానుకగా ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ ప్రజలకు 30వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేశారు. బుధవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో 700 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించామని, పేదల ఇండ్ల నిర్మాణాల కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

01/07/2016 - 07:02

భద్రాచలం, జనవరి 6: రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు గోదావరి లోయ ఖమ్మం జిల్లా భద్రాచలంలో బుధవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యువ కళాకారుల ప్రదర్శనలతో శ్రీ రామదివ్యక్షేత్రం హోరెత్తింది.

01/07/2016 - 07:01

నార్కట్‌పల్లి, జనవరి 6: ఐదుకోట్ల రూపాయలతో ఓ చిట్టీల వ్యాపారి ఉడాయించిన సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో వెలుగుచూసింది. నమ్మకమే పెట్టుబడిగా ప్రజల్లో మంచి గుర్తింపు సాధించిన అక్కనపల్లి సైదులు అనే వ్యక్తి నార్కట్‌పల్లిలో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ఐదు కోట్ల రూపాయలతో మంగళవారం అర్ధరాత్రి ఉడాయించాడు.

01/07/2016 - 06:43

హైదరాబాద్, జనవరి 6: కేరళ రాష్ట్రంలోని శబరిమలకు తెలంగాణ నుంచి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం నిర్మించబోయే వసతి సముదాయానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేరళ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంపై పంబానదీ తీరంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతకాలు చేశారు.

01/07/2016 - 06:40

హైదరాబాద్, జనవరి 6: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించిన ఉదంతంపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయ జరిగేలా చూడాలని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కె తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు మంత్రి కెటిఆర్ బుధవారం లేఖ రాశారు.

01/07/2016 - 06:39

భైంసారూరల్, జనవరి 6: గొంతులో విక్స్ డబ్బా ఇరుక్కోవడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని మహగాం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన వనజ, గణేష్‌ల మొదటి సంతానమైన సాయికృతిక్ష ఇంట్లోని విక్స్‌డబ్బా మింగడంతో విషయం గమనించిన తల్లి తీయడానికి ఎంత ప్రయత్నించి బయటకు రాకపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

Pages