S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/06/2016 - 07:35

ఆదిలాబాద్,జనవరి 5: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలో నామనగర్ వద్ద ఎర్రవాగు వంతెన పైనుండి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతిచెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపి28జెడ్ 3433) కాగజ్‌నగర్ నుండి బెజ్జూర్ (పాపన్నపేట్)కు బయల్దేరింది.

01/06/2016 - 06:25

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో మరో వెయ్యి పోస్టుల భర్తీకి ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ, భూగర్భ జలవనరుల శాఖల్లో 1069 ఖాళీలను నేరుగా నియమించడానికి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల భర్తీ బాధ్యతను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు అప్పగించింది. వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారి గ్రేడ్ 2 పోస్టులు 1000 భర్తీ చేస్తారు.

01/06/2016 - 06:22

హైదరాబాద్, జనవరి 5: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకే నాగపూర్ నుంచి శ్రీనగర్ వెళ్లామని, అక్కడినుంచి సిరియా వెళ్లాలనుకున్నామని ‘సిట్’ అధికారుల విచారణలో నిందితులైన ఇంజనీరింగ్ విద్యార్థులు అంగీకరించారు. చంచల్‌గూడలో ముగ్గురు విద్యార్థులను స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం అధికారులు మూడు రోజులుగా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.

01/06/2016 - 06:21

హైదరాబాద్, జనవరి 5: రియల్ ఏస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి సరళీకృతం చేసిన భవన నిర్మాణాల అనుమతులతో పాటు ఈ రంగం ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

01/06/2016 - 06:18

హైదరాబాద్, జనవరి 5: వీధుల్లో చిరు వ్యాపారాలు (స్ట్రీట్ వెండర్స్) నిర్వహించుకునే వారి జీవనోపాధికి భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వపరంగా గుర్తింపు కార్డులు జారీ చేయడానికి విధివిధానాలను ఖరారు చేస్తూ మంగళవారం మున్సిపల్ పాలనా, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి కోసం ఇదివరకే కేంద్రం చేసిన చట్టం-2014ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

01/06/2016 - 06:16

వరంగల్, జనవరి 5: విద్యుత్‌రంగంలో తెలంగాణను మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ కృషిలో భాగంగానే 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసినట్టు ప్రకటించారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో 2018 నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

01/06/2016 - 06:12

వరంగల్, జనవరి 5: ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించారని, ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకే ప్రభుత్వం ముందుకుపోతుందని సిఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మంగళవారం నందనగార్డెన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.

01/06/2016 - 04:58

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ ఎమ్సెట్‌ను మే 2న నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ జెఎన్‌టియుకు అప్పగించారు. ఇసెట్‌ను 2016 మే 12న నిర్వహిస్తారు.

01/05/2016 - 13:18

మెదక్ : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మనూరు మండలం ఏస్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయ రెండోదశలో భాగంగా జిల్లాలో రూ. 400 కోట్లతో 1760 చెరువులకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. మిషన్ కాకతీయలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి రూ. 31 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

01/05/2016 - 11:47

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఈ నెల 9న నిజాం కాలేజీ మైదానంలో జరిగే బహిరంగసభలో టిడిపి అధ్యక్షుడు, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ సభకు భారీ ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు టి-టిడిపి నేతలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. సీట్ల సర్దుబాటుపై బిజెపితో ఒప్పందం కుదుర్చుకునే బాధ్యతలను పార్టీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లికి అప్పగించారు.

Pages