S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/27/2015 - 17:28

మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఎర్రవల్లిలో అయిదురోజులుగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం ఆదివారం సాయంత్రం పరిసమాప్తమైంది. వేదపండితులు శాస్త్రోకంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి రోజున యాగాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో విఐపిలు, ప్రజలు ఎర్రవల్లికి తరలివచ్చారు. లోకకల్యాణం కోసం ఈ యాగాన్ని నిర్వహించినట్లు కెసిఆర్ ప్రకటించారు.

12/27/2015 - 17:27

మెదక్: ఎర్రవల్లిలో కెసిఆర్ ఫామ్ హౌస్‌లో అయుత చండీయాగంలో చివరి రోజున ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. యాగశాలలో ఒక చోట మంటలు లేచి పొగలు రావడంతో వెంటనే ఫైర్ సిబ్బంది రంగప్రవేశం చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

12/27/2015 - 17:27

మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న అయుత చండీయాగం కార్యక్రమాలు అయిదో రోజు ఘనంగా జరిగాయి. ఎపి సిఎం చంద్రబాబు చివరి రోజు యాగానికి వచ్చిన సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఇద్దరు సిఎంలు యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబు వెంట ఎపి మంత్రులు కెఇ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తదితరులు వచ్చారు.

12/27/2015 - 17:26

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల నుంచి ఆరు స్థానాలకు ఎన్నికల సందర్భంగా ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది. భారీ బందోబస్తు నడుమ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. రంగారెడ్డిలో 2, మహబూబ్‌నగర్‌లో 2, నల్లొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు జిల్లాల్లో 19 చోట్ల పోలింగ్ నిర్వహించారు.

12/27/2015 - 07:13

నేడే పోలింగ్..అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 1110మంది ఓటర్లు

12/26/2015 - 19:10

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి నాలుగు జిల్లాల నుంచి ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో ఖాళీ అయిన 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

12/26/2015 - 17:17

మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న అయుత చండీయాగం నాలుగో రోజు శనివారం వేడుకగా జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పూజలు, హోమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

12/26/2015 - 12:39

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళుతున్న ముగ్గురు హైదరాబాద్ యువకులను నాగపూర్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. జంటనగరాలకు చెందిన ఈ ముగ్గురు యువకులు కొద్దిరోజులుగా ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. నాగపూర్‌వరకు రోడ్డుమార్గంలోను, అక్కడినుంచి శ్రీనగర్ మీదుగా ఆఫ్గానిస్తాన్‌కు వెళ్లాలన్నది వారి పథకం.

12/26/2015 - 07:11

గులాబీ దళాపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఈ సంవత్సరం బాగా కలిసొచ్చింది. గత సంవత్సరం ఉద్యమం ఫలించి అధికారం చేజిక్కగా వరుస విజయాలతో ఈ సంవత్సరం బాగా కలిసొచ్చింది. సికిందరాబాద్ కంటోనె్మంట్, వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం,శాసన మండలి ఎన్నికలు అన్నింటిలోనూ వరుస విజయాలు. గ్రాడ్యుయేట్ నియోజక వర్గాల్లో హైదరాబాద్‌లో బిజెపికి ఒక్కసీటు విజయం సాధించడం మినహాయిస్తే ఎన్నికలన్నింటిలో టిఆర్‌ఎస్‌దే విజయం.

Pages