S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/22/2015 - 08:20

బీబీనగర్, డిసెంబర్ 21: నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలంలోని కొండమడుగుమెట్టు కేపాల్ సమీపంలో పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సోమవారం కలకలం రేపింది. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వారాల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం బచ్చన్నగూడెంకు చెందిన కోయ క్రిష్ణారెడ్డి 20 సంవత్సరాల క్రితం అవుషాపూర్ గ్రామంలో నివాసముంటూ కొండమడుగు కేపాల్ వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు.

12/22/2015 - 08:20

కరీంనగర్ , డిసెంబర్ 21: ఎల్లంపల్లి నిర్మాణ గుత్తేదారులు వీధి రౌడీలయ్యారు. గుత్తేదారులు, ఉపగుత్తేదారులు ఇరువర్గాలుగా మారి ప్రధాన రహదారిపైనే గుద్దులాటకు దిగారు. ఒకరిపై ఒకరు పోటీపడి పిడిగుద్దులు కురిపించుకోవడం మల్లయుద్ధాన్ని తలపించింది. వీరిని ఆపేందుకు పోలీసులు కూడా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ సంఘటన కరీంనగర్ పట్టణంలోని రహదారులు, భవనాల శాఖ అతిధిగృహం ఎదుట సోమవారం జరిగింది.

12/21/2015 - 11:56

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు సోదాలు చేసి ఇద్దరు ప్రయాణీకుల నుంచి దాదాపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణీకుడు శరీర భాగంలో 950 గ్రాముల బంగారాన్ని దాచి తెస్తున్నట్లు స్కానింగ్‌లో కనుగొన్నారు. మరో ప్రయాణీకుడి లగేజీని తనిఖీ చేయగా సుమారు

12/21/2015 - 11:55

మెదక్: తెలంగాణ సి.ఎం కెసిఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ వద్ద సోమవారం ఉదయం తన సతీమణితో కలిసి గణపతి యాగం నిర్వహించారు. బుధవారం నుంచి అయుత చండీయాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో గణపతి యాగం జరిపారు. చండీయాగానికి పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్టప్రతి హాజరు కానున్న నేపథ్యంలో సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి.

12/21/2015 - 11:54

హైదరాబాద్: సరూర్‌నగర్ వద్ద సూర్యానగర్ కాలనీలో సోమవారం ఉదయం రోడ్డుపై నడచిన వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు గొలుసు తెంపుకొని పారిపోయాడు. దీంతో అదుపుతప్పి మహిళ కింద పడిపోవడంతో ఆమె తలకు గాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

12/21/2015 - 08:02

హైదరాబాద్, డిసెంబర్ 20:క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అధికారికంగా ఆదివారం సాయంత్రం నిజాం కాలేజిలో క్రైస్తవ ప్రముఖులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావువిందు ఇచ్చా రు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు హాజరైన చిన్నారులకు గిఫ్ట్‌లు అందజేశారు.

12/21/2015 - 08:01

హైదరాబాద్, డిసెంబర్ 20: పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు.

12/21/2015 - 07:59

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, కల్వకుంట్ల రాజ్యాంగం అమలులో ఉందని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.

12/21/2015 - 07:12

హైదరాబాద్, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఈనెల 23న నుంచి జరిగే అయుత చండీయాగం మతాలకు అతీతంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో మూడు రోజుల తరువాత యాగం ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటి నుంచే జనం యాగం జరిగే ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఆదివారం కొంత మంది నన్స్ యాగశాలకు వచ్చారు. గజ్వేల్ చర్చికి చెందినవారు యాగశాల వద్ద ఏర్పాట్లు చూసి వివరాలు తెలుసుకొని వెళ్లారు.

12/21/2015 - 07:12

నల్లగొండ, డిసెంబర్ 20: టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విపక్షాల ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరుతున్నారంటున్న మంత్రి జి.జగదీష్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఎందుకు ప్రలోభ పెడుతున్నారని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Pages