S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/21/2015 - 07:11

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 20: శాసనమండలికి ఈనెల 27న జరిగే ఎన్నికలను ఓటర్లయిన టిడిపి ప్రజాప్రతినిధులు బహిష్కరించనైనా బహిష్కరించాలని, లేకుంటే ఆత్మప్రభోధంపై ఓటైనా వేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కోరారు.

12/21/2015 - 07:10

షాద్‌నగర్, డిసెంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ ఎపిజివిబి బ్యాంకు దోపిడీ కేసులో ఉగ్రవాదుల హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా పోలీస్ ఉన్నత స్థాయి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పలు రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

12/21/2015 - 07:08

సంగారెడ్డి, డిసెంబర్ 20: విశ్వశాంతి, రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ చండీమాత ప్రసన్నం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్వహించతలపెట్టిన అయుత మహా చండీయాగం ప్రాంగణం మొత్తం చూడచక్కని పద్ధతుల్లో తీర్చిదిద్దుతున్నారు. ఆధునిక ఏర్పాట్ల జోలికి వెళ్లకుండా సాధుసంతులకు ఇష్టమైన కుటీరాలను ఏర్పాటు చేసి వాటిల్లో బస కల్పించనున్నారు.

12/21/2015 - 07:04

ఖమ్మం, డిసెంబర్ 20: వైకుంఠ రాముడు జగదభిరాముని జలవిహారం ఆదివారం రాత్రి పవిత్ర గోదావరి నదిలో వైభవంగా జరిగింది. భక్తుల జయజయధ్వానాలు, ఆనందోత్సాహాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణలు, కూచిపూడి నృత్యాలు, కోలాటాలు, దిక్కులు పిక్కటిల్లేలా ‘జైశ్రీరాం’ అనే నినాదాలు, కళ్లు మిరుగుట్లు గొలిపేలా ఆకాశంలో బాణసంచా వెలుగుల మధ్య సీతా సమేతుడై శ్రీరామచంద్రుడు పావన గోదావరి నదిలో విహరించారు.

12/21/2015 - 01:48

ఆదిలాబాద్ (బెజ్జూరు), డిసెంబర్ 20: బోనాల పండుగకు ఇంటినుంచి బయలుదేరినవారు గంటలోపే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం సుల్గుపెల్లి, లోడ్‌పెల్లి అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో దహెగాం, బెజ్జూరు మండల వాసులు ఉన్నారు.

12/21/2015 - 01:46

హైదరాబాద్, డిసెంబర్ 20: గత ప్రభుత్వాలు రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 425 కోట్ల రూపాయల విలువైన పైపులు, పంపులు, మోటార్లు హడావుడిగా కొనుగోలు చేసి ప్రాజెక్ట్ సైట్‌లో మూలనపడేశారు. కోట్ల రూపాయల పంపుసెట్ల కొనుగోలులో శ్రద్ధచూపినా, ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకు సాగునీటిని అందించాలనే ఆసక్తి మాత్రం చూపలేదు.

12/21/2015 - 01:44

హైదరాబాద్, డిసెంబర్ 20: గోదావరిపై తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులతో మహారాష్టక్రు ముంపులేకుండా రీ డిజైన్ చేసినట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర సిఎం ఫడ్ననీస్‌కు వివరించారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు తొలగిపోయాయి.

12/20/2015 - 07:23

21న కామారెడ్డిలో అఖిలపక్ష సమావేశం : షబ్బీర్‌అలీ వెల్లడి

12/20/2015 - 07:23

పొత్తూరి వెంకటేశ్వరరావు

12/20/2015 - 07:22

కడెం,డిసెంబర్ 19: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల నర్సాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం తిని 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి...

Pages