S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/30/2015 - 05:40

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన ‘నేను నా కుటుంబం..నా పరివారం’ అన్న చందాన ఉందని టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో రోజంతా సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

11/30/2015 - 05:37

హైదరాబాద్/రాజేంద్రనగర్, నవంబర్ 29: ఔటర్ రింగ్‌రోడ్డు మరోసారి రక్తసిక్తమయ్యింది. కుటుంబ సమేతంగా ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అమాంతం రోడ్డు అవతలి వైపు ఎగిరి పడింది. ఎదురుగా వస్తున్న మరో కారును వేగంతో ఢీకొట్టింది. ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

11/30/2015 - 05:28

భద్రాచలం, నవంబర్ 29: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కార్తీక రామ పునర్వసు దీక్షలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రుని మంటపంలో భక్తుల రామనామ సంకీర్తన నడుమ శ్రీ సీతారామచంద్రస్వామి అలంకారమూర్తులకు అభిషేకం నిర్వహించారు. రామ పాదుకలకు పూజలు చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిపాక పుణ్యజలాలను శ్రీరామ దీక్షాపరులపై చల్లారు.

11/30/2015 - 05:27

పుల్‌కల్, నవంబర్ 29: బోరుబావిలో పడిపోయిన బాలుడు రాకేష్‌ను ప్రాణాపాయం నుంచి రక్షించడానికి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన ఉదయం 6.30 గంటలకు చోటు చేసుకుంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ సాయంత్రం వరకు రాకపోవడం, జిల్లా ఎస్పీ అసలే పట్టించుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

11/30/2015 - 05:26

ధర్మపురి, నవంబర్ 29: భారతదేశ ప్రాచీన నాగరికత, సభ్యతా సంస్కృతులకు మూలాధారాలైన , ప్రాత: స్మరణీయాలైన నదులను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి ఉద్భోదించారు.

11/30/2015 - 05:26

రఘునాథపల్లి, నవంబర్ 29: ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి వద్ద వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

11/30/2015 - 05:25

నల్లగొండ/మహబూబ్‌నగర్/సంగారెడ్డి/ నిజామాబాద్, నవంబర్ 29: పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతునే ఉన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఆదివారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా ఒకరు గుండెపోటుతో మరణించారు. మహబూబ్ నగర్ జిల్లా కొందుర్గు మండల పరిధిలోని పెద్దఎల్కిచర్ల గ్రామానికి చెందిన గట్టుపల్లి భీమయ్య (50) అనే రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు.

11/30/2015 - 05:24

కరీంనగర్, నవంబర్ 29: ప్రాదేశిక, పురపాలిక (ప్రజాప్రతినిధులు)ల సంఖ్యా పరంగా చూస్తే దాదాపుగా టిఆర్‌ఎస్ ఖాతాలోకే రెండు ఎమ్మెల్సీ పదవులు వెళ్లే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. ఇప్పటికే జిల్లాలో ఎదురులేని శక్తిగా అవతరించిన తెరాసకు మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.

11/30/2015 - 05:22

మహబూబ్‌నగర్, నవంబర్ 29: మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కంది పంటలపై కూడా పడింది. చలికాలంలో కురిసిన మంచుకు అడపదడప పడే వర్షానికి జిల్లాలో కందిపంట దిగుబడి కానుంది. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు పండించే కందులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని తాండూరుకు తరలించి రైతులు విక్రయించే అనవాయితీ ఉంది.

11/30/2015 - 05:13

భద్రాచలం, నవంబర్ 29: ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో మావోయిస్టులు ఆదివారం కలకలం రేపారు. ఆంధ్రా- తెలంగాణ సరిహద్దుల్లోని ఎటపాక- భద్రాచలం పోలీసుస్టేషన్ల సమీపంలో పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ శబరి ఏరియా కమిటీ పేరుతో వాల్‌పోస్టర్లను వదిలారు.

Pages