S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/18/2018 - 03:29

బాసర, ఫిబ్రవరి 17: బాసర క్షేత్రంలో మరో వివాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యా హ్నం అమ్మవారి నివేదన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద కొందరు తెరాస నాయకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించడం వివాదానాకి కేంద్ర బిందువుగా మారింది. ప్రతి రోజు మధ్యాహ్నం 12-30 గంటల నుంచి 2-00 గంటల వరకు ప్రతిరోజూ ఆలయాన్ని మూసివేస్తారు.

02/18/2018 - 03:28

సూర్యాపేట, ఫిబ్రవరి 17: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో అతితక్కువ సమయంలో అత్యంత అభివృద్ధి సాధించి నేడు ప్రపంచానికే అభివృద్ధి పరిశోధనకేంద్రంగా నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

02/18/2018 - 03:26

ఖమ్మం, ఫిబ్రవరి 17: కేంద్ర, రాష్ట్రాలలో పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వామపక్షాల ఐక్య ఉద్యమాలతో పాతర వేయాలని సీపీ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సీపీఐ మహాసభల్లో భాగంగా శనివారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వామపక్షాలు సమైక్యంగా సమన్వయం తో ఉద్యమించి బీజేపీ, సంగ్ పరివార్ లాంటి వాటిని తరిమివేయాల్సిన అవసరం ఉందన్నా రు.

02/18/2018 - 01:57

నల్లగొండ, ఫిబ్రవరి 17: లోక సంరక్షణ, విశ్వశాంతిని కాంక్షిస్తూ తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధినొందిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి.

02/18/2018 - 01:54

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. రాష్టప్రతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం.

02/17/2018 - 23:45

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసి)లో 280 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రత్యక్ష నియామక పద్దతిలో రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 280 పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తూ శనివారం ఆర్ధిక శాఖ జివో జారీ చేసింది.

02/17/2018 - 23:44

హైదరాబాద్, ఫిబ్రవరి 17: నారుూ బ్రాహ్మణ యువతి, యువకులకు వృత్తి నైపుణ్యంలో ఆధునిక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. ఆధునికంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా నారుూ బ్రాహ్మణ యువత సాంకేతికంగా అభివృద్ధిలోకి వచ్చే విధంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యలం 650 మందికి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని అన్నారు.

02/17/2018 - 23:43

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న నార్తరన్ విద్యుత్ డిస్కాం పరిధిలో 2553 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాల భర్తీపై ఆ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి రెగ్యులర్ ప్రాతిపదికన దరఖాస్తులను కోరినట్లు ఆ సంస్థ సిఎండి అన్నమనేని గోపాల్‌రావు చెప్పారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉన్నాయన్నారు.

02/17/2018 - 23:43

హైదరాబాద్, ఫిబ్రవరి 17: కేంద్ర మంత్రులు రాష్ట్రప్రభుత్వ పాలనను ఎక్కడా ప్రశంసించిన సందర్భాలు లేవని, టిఆర్‌ఎస్ మైండ్ గేమ్‌తో పత్రికలు అలా రాస్తున్నాయని, కేంద్ర మంత్రులు ఎవరూ మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర పాలనను ప్రశంసించలేదని బిజెపి అధికార ప్రతినిధులు డాక్టర్ ఎస్ ప్రకాష్‌రెడ్డి, ఎన్ వి సుభాష్, డాక్టర్ కె నరేష్‌లు పేర్కొన్నారు.

02/17/2018 - 23:42

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు శనివారం చెన్నైలో జరిగిన సంస్థ 2018 వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సు ముగింపు సమావేశానికి మంత్రి హాజరై ‘లర్నింగ్ టు గ్రో’ అనే అంశంపై ప్రసంగించారు.

Pages